FD, Savings Account: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు

FD, Savings Account: ప్రస్తుతం బ్యాంకులన్ని తమతమ కస్టమర్లకు శుభవార్తలు అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ అకౌంట్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి..

FD, Savings Account: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు
Bank Interest Rate
Follow us
Subhash Goud

|

Updated on: Aug 22, 2022 | 6:11 PM

FD, Savings Account: ప్రస్తుతం బ్యాంకులన్ని తమతమ కస్టమర్లకు శుభవార్తలు అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ అకౌంట్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచగా, తాజాగా బంధన్‌ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఆగస్టు 22, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బంధన్ బ్యాంక్ వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై ఈ పెంపు ఉంటుంది. బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఇప్పుడు 3.50 శాతం నుండి 7 శాతం వరకు రాబడిని ఇస్తోంది. ఈ వడ్డీ రేటు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FDలకు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ రేటు నుండి 0.75 శాతం అదనపు వడ్డీ రేటు ప్రయోజనం పొందుతారు. బంధన్ బ్యాంక్ ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల FDలపై 7 శాతం వడ్డీని ఇస్తోంది. గతంలో దీని రేటు 6.25 శాతంగా ఉండేది. అదేవిధంగా 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల FDలపై 7 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. మొదటి 2 నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDల వడ్డీ రేటు 6.50 శాతం ఉంది. అలాగే 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి.

బంధన్ బ్యాంక్ చార్ట్ ప్రకారం.. 15 నుండి 30 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 3 శాతం, 31 రోజుల నుండి 2 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 3.50 శాతం, 2 నెలల నుండి 3 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 4.50 శాతం, 3 నెలల నుండి 6 నెలల వరకు 4.50 శాతం కంటే తక్కువ. అలాగే 6 నెలల కంటే ఎక్కువ, 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 4.50 శాతం, 1 సంవత్సరం నుండి 18 నెలల FDలపై 7 శాతం, 18 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 7 శాతం, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల FDలపై 5.60 నుంచి 7 శాతం వరకు ఇవ్వబడుతుంది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటుపై 0.75 శాతం అదనపు వడ్డీని అందజేస్తోంది బ్యాంకు.

సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు:

ఇవి కూడా చదవండి

లక్ష నుంచి 10 లక్షల డిపాజిట్లపై 6 శాతం వడ్డీని బంధన్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఈ రేటు 5 శాతంగా ఉండేది. ఈ విధంగా పొదుపు ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉంచేందుకు వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇక్కడ 100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం. పొదుపు ఖాతాలోని ఇతర నిల్వలపై వడ్డీ రేట్లు మునుపటిలా ఉన్నాయి. పొదుపు ఖాతాలో రూ. 1 లక్ష డిపాజిట్లపై 3 శాతం, రూ. 1 లక్ష నుండి రూ. 10 లక్షల వరకు పెరిగే బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6 శాతం, రూ. 10 లక్షల నుండి రూ. 2 కోట్లకు పైగా బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6.25 శాతం, ఇక 2 కోట్లు, 100 కోట్ల వరకు డిపాజిట్లపై సంవత్సరానికి 6 శాతం వడ్డీ అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే