AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: భారత మీడియా రంగంలో భారీ డీల్.. అదానీ చేతికి NDTV గ్రూప్..

NDTV media group: వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. మీడియా గ్రూప్ ఎన్‌డిటివిలో(NDTV) 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ మీడియా ప్రకటన వెల్లడించింది.

Adani Group: భారత మీడియా రంగంలో భారీ డీల్.. అదానీ చేతికి NDTV గ్రూప్..
Ndtv Media Group
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 9:30 PM

Share

వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. మీడియా గ్రూప్ ఎన్‌డిటివిలో(NDTV) 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ మీడియా ప్రకటన వెల్లడించింది. ఈ కొనుగోలు వివరాలను మీడియా ఇనిషియేటివ్స్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ CEO, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా వెల్లడించారు. AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ (AMNL)కి చెందిన అనుబంధ సంస్థ అయిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా 29.18 శాతం వాటాను కొనుగోలు చేయడం పరోక్షంగా ఉంటుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) యాజమాన్యంలో ఉంది.

NDTV అనేది మూడు దశాబ్దాలుగా విశ్వసనీయమైన వార్తలను అందించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థ. కంపెనీ మూడు జాతీయ వార్తా ఛానెల్‌లను నిర్వహిస్తోంది – NDTV 24×7 NDTV ఇండియా, NDTV ప్రాఫిట్. ఇది బలమైన ఆన్‌లైన్ వ్యవస్థను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో 35 మిలియన్లకు పైగా అనుచరులతో సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే వార్తల హ్యాండిల్స్‌లో ఒకటిగా ఉంది. NDTV INR 123 Cr, EBITDAతో INR 421 Cr ఆదాయాన్ని, FY22లో INR 85 Cr నికర లాభాన్ని అతితక్కువ అప్పులతో కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం