Credit Card Benefits: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? అయితే ఇలాంటి లెక్కలేనని ప్రయోజనాలు మీ కోసమే..

క్రెడిట్ కార్డుల‌ పట్ల అవ‌గాహ‌న లేక‌పోతే మాత్రం ప్రయోజనాల సంగతి పక్కన పెడితే.. అధిక ఛార్జీల‌ బారిన పడతారు. క్రెడిట్ కార్డుతో పొందే లాభాలు ఏంటో తెలుసుకుందాం..

Credit Card Benefits: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? అయితే ఇలాంటి లెక్కలేనని ప్రయోజనాలు మీ కోసమే..
Credit Card
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 22, 2022 | 3:59 PM

క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా దేశంలో ప్రతి ఏడాది కోటీ 80 లక్షలకు పైగానే కార్డులు జారీ అవుతున్నయని ఓ సంస్థ తేల్చింది. క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే.. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగిస్తే అదో పెద్ద అక్షయ పాత్ర అని చెప్పవచ్చు. చేతిలో చిల్లి గవ్వా లేకున్నా.. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. అవసరమైన పక్షంలో పరిమిత నగదుకు ఉపసంహరణపై వడ్డీ ఉండదు. అపరిమిత రివార్డ్ పాయింట్స్ ప్రయోజనం ఉంటుంది. అంతే కాదు బీమా కవరేజీ కూడా ఉంటుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్ ఇలా చాలా లాభాలు. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకుంటే రుణాలు, వడ్డీపై లాభం ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ సహా అన్నింటిపై అవగాహనను కలిగి ఉంటే క్రెడిట్ కార్డుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డుల‌ పట్ల అవ‌గాహ‌న లేక‌పోతే మాత్రం ప్రయోజనాల సంగతి పక్కన పెడితే.. అధిక ఛార్జీల‌ బారిన పడతారు. క్రెడిట్ కార్డుతో పొందే లాభాలు ఏంటో తెలుసుకుందాం..

వెల్‌కమ్ ఆఫర్‌:  చాలా బ్యాంకులు / క్రెడిట్ సంస్థలు కార్డ్ హోల్డర్‌కు వివిధ రకాలవెల్‌కమ్ ఆఫర్లను అందిస్తాయి.  ఈ బహుమతులను వోచర్‌లు, డిస్కౌంట్‌లు లేదా బోనస్ రివార్డ్ పాయింట్‌ల రూపంలో మనం పొందవచ్చు.

ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు: ఈ రోజుల్లో దాదాపు అన్ని రకాల క్రెడిట్ కార్డ్‌లపై ఈ తగ్గింపును పొందవచ్చు. మీరు మీ వాహనంలో ఇంధనాన్ని నింపినప్పుడల్లా..  కొంత వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్: మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసిన ప్రతిసారీ.. మీ ఖాతాలో కొన్ని రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వచ్చపడుతుంటాయి. క్యాష్‌బ్యాక్ నేరుగా మీ కార్డ్ ఖాతాలో చేరిపోతాయి. ఇలా వచ్చే రివార్డ్ పాయింట్‌లను ఉచిత బహుమతులు కూడా పొందవచ్చు. ఏదైనా ఇతర వస్తువు ధరను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. మీరు ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉన్నట్లయితే.. మీరు విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఉపయోగించే రివార్డ్ పాయింట్‌లకు బదులుగా ఎయిర్ మైళ్లను సంపాదించవచ్చు.

ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్: కొన్ని క్రెడిట్ కార్డ్‌లు దేశీయ విమానాశ్రయాలు అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాలలో సంవత్సరానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు లాంజ్ వసతిని అందిస్తాయి. ట్రావెల్-సెంట్రిక్ క్రెడిట్ కార్డ్‌లు, ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లు వీటిని ప్రత్యేకంగా అందిస్తాయి.

నగదు అడ్వాన్స్: మీరు మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ATM నుంచి నేరుగా నగదు తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు నగదు అవసరమైనప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నగదును తీసుకుంటే మంచిది. లేకుంటే మీరు తీసుకున్న మొత్తం డబ్బులపై అధిక వడ్డీని వసూలు చేస్తాయి క్రెడిట్ కార్డ్ సంస్థలు.

బీమా: క్రెడిట్ కార్డ్‌లు కూడా బీమాను అందిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు నిర్ణీత కవర్ మొత్తాన్ని అందిస్తాయి. ఇది ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్, కార్డ్ లాస్ కవర్ లేదా ఫారిన్ హాస్పిటలైజేషన్ కవర్ కావచ్చు.

EMI కన్వర్ట్: EMI మార్పిడి అనేది క్రెడిట్ కార్డ్‌లో లభించే అత్యంత సాధారణ ప్రయోజనం.  మీరు పెద్ద మొత్తం షాపింగ్ చేసినప్పుడు.. ఆ కొనుగోలు మొత్తంను EMIలుగా మార్చవచ్చు.

యాడ్-ఆన్ కార్డ్: అనేక క్రెడిట్ కార్డ్‌లు మీ జీవిత భాగస్వామి, తోబుట్టువులు, పిల్లలు, తల్లిదండ్రులతో సహా మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకునేందుకు అనువుగా.. యాడ్-ఆన్ కార్డ్ (సప్లిమెంటరీ కార్డ్ అని పిలుస్తారు)ని కలిగి ఉండటానికి  అనుమతిస్తాయి. ఇలా ఈ ప్రయోజనాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా ప్రైమరీ కార్డ్ లాగానే ప్రయోజనాలను అందిస్తాయి.

మీరు చదవుకుంటున్న సమయంలో మీ పాఠశాలలో ఇచ్చే మార్కుల మాదిరిగానే.. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక గుర్తింపు. ఇది 300-850 మ‌ధ్య ఉండే 3 అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ చ‌రిత్రను చూపిస్తుంది. క్రెడిట్ స్కోర్ మీ గ‌త రుణాలు, చెల్లింపుల ఆధారంగా వీటిని లెక్కిస్తారు. మీరు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన ప్రతిసారీ దీన్ని చెక్ చేసుకుంటే మంచిది. అందుకే.. క్రెడిట్ కార్డుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం