AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రైతన్న ఆలోచనకు జనం ఫిదా.. కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే..

ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో అడ్డుగా ఉన్న తన ఇల్లును కాపాడుకునేందుకు పంజాబ్‌లోని ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. సుఖ్విందర్‌ సింగ్‌ సుఖీ అనే రైతు తన రెండంతస్తుల భవనం మొత్తాన్ని..

Watch: రైతన్న ఆలోచనకు జనం ఫిదా.. కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే..
Punjab Farmer House
Sanjay Kasula
|

Updated on: Aug 21, 2022 | 9:10 AM

Share

ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు అనేది మన పెద్దలు చెప్పిన సామెత. ఓ పెళ్లిని చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో.. ఇంటిని కట్టేందుకు కూడా అన్ని కష్టాలు పడాల్సిందే. సొంతింటిని కట్టుకునేటప్పుడు తమకు నచ్చిన విధంగా ఉండేందుకు తెగ ప్లాన్ చేస్తుంటారు. ఏది ఎక్కడ ఉండాలో స్వయంగా డిసైడ్ చేస్తుంటారు. ఇందు కోసం పెద్ద ఎత్తున డబ్బును వెచ్చించి నచ్చిన మెటిరియలల్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇంత ఇష్టంతో కట్టుకున్న ఇంటిని కూల్చాల్సి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓ రైతుకు. తన వ్యవసాయ క్షేత్రం మీదుగా ఢిల్లీ-అమృత్‌సర్‌-కాత్రా ఎక్స్‌ప్రెస్‌వే వెల్తుండటంతో కొత్తగా కోటిన్నర ఖర్చు పెట్టి నిర్మించుకున్న ఇంటిని కూల్చాలని నోటీసీలు వచ్చాయి.

ఈ నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో అడ్డుగా ఉన్న తన ఇల్లును కాపాడుకునేందుకు పంజాబ్‌లోని ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. సుఖ్విందర్‌ సింగ్‌ సుఖీ అనే రైతు తన రెండంతస్తుల భవనం మొత్తాన్ని ఇలా 500 అడుగులు వెనక్కి జరిపించాడు. ఢిల్లీ-అమృత్‌సర్‌-కాత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో సంగ్రూరులోని రోషన్‌వాలా గ్రామానికి చెందిన ఈ రైతు ఇల్లును వెనక్కి జరుపుకొని తన ఇంటిని కూల్చకుండా కాపాడుకున్నాడు. ఆందోళనలు.. నిరసనలకు దిగకుండా తన తెలివికి పదును పెట్టాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అందిరి దృష్టిలో పడ్డాడు.

ఇవి కూడా చదవండి

సంగ్రూర్ జిల్లా రోషన్వాలా గ్రామానికి చెందిన రైతు సుఖ్వీందర్ సింగ్ సుఖీ తన పొలంలో ఇంటిని నిర్మించుకున్నాడు.ఈ ఇంటిని నిర్మించుకునేందుకు దాదాపుగా కోటిన్నరకుపైగా ఖర్చుచేశాడు. అయితే, భారతమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం చేపట్టిన ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌వే (Delhi Amritsar Katra Expressway) ఆయన వ్యవసాయ క్షేత్రం మీదుగానే వెళ్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఢిల్లీ-కాట్రా మధ్య ప్రయాణ సమయంలో భారీగా తగ్గనుంది. హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ గుండా ఎక్స్‌ప్రెస్‌వే సాగనుంది.

ఈ నేపథ్యంలో రహదారికి అడ్డుగా ఉన్న ఇంటిని కూల్చివేతకు పంజాబ్ ప్రభుత్వం రైతు సుఖ్వీందర్ సింగ్‌కు ఇప్పటికే నష్ట పరిహారం కూడా చెల్లించింది. అయితే, ఆయన మాత్రం కూల్చ లేదు. తాను ఎంతో ప్రేమగా నిర్మించుకున్న ఇంటిని రహదారికి దూరంగా.. అంటే సుమారు 500 అడుగుల దూరంలోని మరో ప్రదేశానికి తరలించాడు.ఇందుకు ఆయన తన ఇంటిని కూలీలు, ఇంజినీర్ల సాయంతో మేర ప్రదేశానికి తరలించాడు. పొలం నుంచి ఆ భవనాన్ని పునాదులతో సహా తరలించడానికి చక్రాలను ఉపయోగించాడు.

కోటిన్నర ఖర్చుపెట్టిన ఈ ఇంటి నిర్మాణానికి రెండేళ్లు పట్టిందని రైతు సుఖ్వీందర్ సింగ్ తెలిపాడు. ఇది తన కలల ప్రాజెక్ట్.. కాబట్టి మరో ఇంటిని కట్టే ఉద్దేశం తనకు లేదన్నాడు.

ఢిల్లీ అమృత్‌సర్-కాట్రా జాతీయ రహదారి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. నిర్మాణం పూర్తయితే ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్‌కు వయా పంజాబ్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు సమయం, డబ్బు, ఎనర్జీ ఆదా అవుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం