Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloud Burst: క్లౌడ్‌ బరెస్ట్‌ విధ్వంసం..ఇప్పటి వరకు 22 మంది మృతి.. రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ

సెర్చ్ ఆపరేషన్ అనంతరం వారి ఇంటి శిథిలాల కిందనుంచి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసినట్టుగా చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో ఈ ఇల్లు కూలిపోయిందని తెలిపారు.

Cloud Burst: క్లౌడ్‌ బరెస్ట్‌ విధ్వంసం..ఇప్పటి వరకు 22 మంది మృతి.. రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ
Himachal Rains
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 8:39 AM

Cloud Burst: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు,వరదలు విధ్వంసం సృష్టించాయి. గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. క్లౌడ్‌ బరెస్ట్‌, వరదల వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా 22 మంది మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురు బతికే గల్లంతయ్యారు. మరో 10 మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ కుమార్ మొఖ్తా తెలిపారు. భారీ వర్షాల కారణంగా మండి, కాంగ్రా, చంబా జిల్లాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని మోక్తా తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణ సంబంధిత 36 సంఘటనలు నమోదయ్యాయని ఆయన చెప్పారు.

ఒక్క మండి జిల్లాలోనే వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మృతి చెందారు. ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు.సెర్చ్ ఆపరేషన్ అనంతరం వారి ఇంటి శిథిలాల కిందనుంచి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసినట్టుగా చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో ఈ ఇల్లు కూలిపోయిందని తెలిపారు.

డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం రాత్రి మండి-కటోలా-పరాశర్ రోడ్డులోని బాఘీ డ్రెయిన్‌లో ఇంటికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న మండిలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా వరదల్లో కొట్టుకుపోయారని ఆయన చెప్పారు. క్లౌడ్‌బరెస్ట్‌ తర్వాత చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పాత కటోలా ప్రాంతాల మధ్య ఉన్న తమ ఇళ్లను వదిలి ఇతర సురక్షిత ప్రదేశాలలో తలదాచుకుంటున్నారని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

సిమ్లాలోని థియోగ్‌లో వాహనంపై రాయి పడడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారని మోక్తా చెప్పారు. చంబాలోని చౌవారి బానెట్ గ్రామంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారని మోక్తా తెలిపారు. కాంగ్రాలో మట్టి ఇల్లు కూలిపోయి తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి