UP Lawyer: ఇదెక్కడి దారుణం..మహిళా జడ్జికి తప్పని వేధింపులు.. లాయర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..

గత కొద్ది రోజులుగా ఆ లాయర్‌ తనను వేధిస్తున్నాడని, వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతున్నట్టుగా ఫిర్యాదులో వెల్లడించారు. పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవటంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా మహిళా జడ్జి తెలిపారు.

UP Lawyer: ఇదెక్కడి దారుణం..మహిళా జడ్జికి తప్పని వేధింపులు.. లాయర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..
Fir
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 9:34 AM

UP Lawyer: వేధింపులకు గురయ్యేవారికి రక్షణ కల్పించి, న్యాయం చేయాల్సిన మహిళా జడ్జికే వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళా జడ్జి తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఒక న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది. పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం వేళ మహిళా జడ్జి వాకింగ్‌ చేస్తున్న టైమ్‌లో సదరు లాయర్‌ తనను అనుసరించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బాధిత మహిళా జడ్జి ఆరోపించారు.

అవివాహితురాలైన న్యాయమూర్తి తన ఫిర్యాదులో న్యాయవాది మొహమ్మద్ హరూన్‌ తనను వేధిస్తున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడు తనకు పంపిన వాట్సాప్‌ సందేశాలను కూడా ఆమె స్క్రీన్‌షాట్‌ తీసి కేసుతో జత చేసింది. దాంతో పోలీసులు పలు సెక్షన్ల కింద సదరు లాయర్‌పై కేసు నమోదు చేశారు.

గత కొద్ది రోజులుగా ఆ లాయర్‌ తనను వేధిస్తున్నాడని, వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతున్నట్టుగా ఫిర్యాదులో వెల్లడించారు. పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవటంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా మహిళా జడ్జి తెలిపారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు న్యాయవాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనూప్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు