Telangana: బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

ట్రిపుల్ ఐటీలో గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ 1లో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకోగా..

Telangana: బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు
Ganjai
Follow us

|

Updated on: Aug 21, 2022 | 7:29 AM

Telangana: తెలంగాణలో మరోమారు బాసర ట్రిపుల్‌ ఐటీ సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీలో గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ 1లో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకోగా శనివారం సంబంధిత చట్టాల ప్రకారం బాసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.

ముధోల్ సీఐ వినోద్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు…బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ 2 సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరొక విద్యార్థి తమ హాస్టల్ రూమ్ లో గంజాయి సేవిస్తూ సిబ్బందికి పట్టుబట్టారు. ఎన్దీపీయే అక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కాగా, విద్యార్థుల వద్ద నుండి దాదాపు 100గ్రాములకు పైగా గంజాయి లభ్యమైనట్లు తెలుస్తుంది.

ఎక్కడదీ గంజాయి..? స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐ లతోపాటు దాదాపు 20 గా సెక్యూరిటీ సిబ్బంది భద్రత ప్రామాణాల దృష్ట్యా గస్తికాస్తుంటారు. ఇంత భద్రతా సిబ్బంది నడుమ కళాశాల లోనికి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వద్ద నుండి గంజాయి లభ్యమవడంతో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. సెలవులపై ఇంటికి వెళ్ళిన విద్యార్థులు తమతో పాటుగా గంజాయిని తెచ్చుకున్నారా..? లేదా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరఫరా చేస్తున్నారా..?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బయటకు పొక్కకుండా.. హాస్టల్ గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది.. విద్యార్థుల రూమ్ తనిఖీ చేశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తూ తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్స్‌ అనుమతించకుండా గోప్యత వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో ఒ విద్యార్థి సస్పెండ్ సెలవులపై ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి కళాశాలలోకి వెళ్తున్నప్పుడు స్థానిక సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులు చెక్ చేయగా అందులో సిగరెట్ ప్యాకెట్లు లభిమయ్యాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ఆ విద్యార్థి దాదాపు 8 రోజులకు పైగా సస్పెండ్ చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ జరిపించి మొదటి తప్పుగా క్షమించి వదిలేసినట్లు తెలుస్తుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి