Natural protein drink: బరువు తగ్గించి.. కండరాలకు బలానిచ్చే సత్తు షర్బత్..లాభాలు మరెన్నో..!
ఉదయం ఖాళీ కడుపుతో సత్తును తీసుకోవడం వలన శరీరానికి అద్భుత ఫలితాలు అందిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సత్తులోని అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది..
Natural protein drink: క్రమం తప్పకుండా వర్కవుట్ చేసే వారికి పోస్ట్ వర్కౌట్ చిరుతిండి, పానీయం ప్రాముఖ్యత గురించి తెలుసు. అది శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో ఎలా సహాయపడుతుందో కూడా తెలుసు. అలాంటి వారికోసం ఓ మంచి ప్రోటీన్-రిచ్ పోస్ట్-వర్కౌట్ డ్రింక్ వచ్చేసింది. అదేంటంటే..సత్తు షర్బత్.. వేసవి కాలంలో రోడ్లపై ఎక్కువగా ఈ సత్తు షర్బత్ విక్రయిస్తుంటారు. సత్తు షర్బత్ దాహాన్ని తీరుస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించి హైడ్రేట్‌గా ఉంచుతుంది. సత్తు షర్బత్‌ను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంతకీ ఈ షర్బత్ ఎలా తయారు చేస్తారు. మరిన్ని ఉపయోగాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సత్తు అంటే..పప్పులు, తృణధాన్యాల నుండి తయారు చేయబడిన ప్రోటీన్-రిచ్ పౌడర్..ముఖ్యంగా కాల్చిన శెనగల నుంచి సత్తు షర్బత్ తయారు చేస్తారు. సత్తు అనేది వేసవిలో ఔషధం కంటే తక్కువ లేని దేశీ పవర్ ఫుడ్. ముఖ్యంగా వేడిని పోగొట్టడానికి .. శరీరానికి శక్తిని ఇవ్వడానికి సత్తు వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా సత్తు వినియోగం చాలా మేలు చేస్తుంది. కండరాల మరమ్మతు, పునరుద్ధరణ బరువు తగ్గడానికి పోస్ట్-వర్కౌట్ రొటీన్‌కు ప్రోటీన్ ఫుడ్‌గా పనిచేస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో సత్తును తీసుకోవడం వలన శరీరానికి అద్భుత ఫలితాలు అందిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సత్తులోని అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది.. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. శరీరానికి శక్తినిస్తుంది, అనేక ఆరోగ్య రుగ్మతల నుండి రక్షిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి సత్తు పానీయం అద్భుత ఔషధం. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సత్తులో పొటాషియం,మెగ్నీషియం కావాల్సినంత ఉండటంతో..ఇవి ఆకలిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులోని ఐరన్ కంటెంట్ కారణంగా. శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. రోజులో మీకు తగినంత శక్తిని అందిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు సత్తు షర్బత్ మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, అజీర్తిని కూడా నివారిస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఉత్తమమైన ఆహారాలలో ఒకటి.
View this post on Instagram
సత్తు తయారీకి కావలసిన పదార్థాలు.. 1 గ్లాసు – నీరు 3-4 టేబుల్ స్పూన్లు – సత్తు పొడి ¼ టేబుల్ స్పూన్ – నల్ల ఉప్పు ¼ టేబుల్ స్పూన్ – వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ – నిమ్మరసం
సత్తు తయారీ విధానం.. కావాల్సిన పదార్థలన్నీంటిని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్నీ నీళ్లు పోసి బాగా కలపాలి. నిమ్మరసం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత తాగేసేయాలి. అంతే..
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి