Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతి..

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయానికి భక్తుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు చనిపోయారు.

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతి..
Janmashtami Rush
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:22 PM

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో అర్థరాత్రి కిక్కిరిసిన భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతిచెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆలయలోంచి బయటకు వచ్చే మార్గంలో ఒక భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. దీని కారణంగా భక్తుల రాకపోకలను పరిమితం చేశారు. వారి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆవరణలో ఉన్న చాలా మంది ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

‘ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయానికి భక్తుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు మహిళగా చెప్పారు.. మధుర సీనియర్‌ పోలీసు అభిషేక్‌ యాదవ్‌. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్టు వెల్లడించారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు.

శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మస్థలంగా పరిగణించబడే మధురను ఒక పవిత్ర ప్రదేశంగా పరిగణిస్తారు.మధుర,బృందావనం వంటి ఆలయాలు అద్భుతంగా అలంకరించబడ్డాయి . వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఇక శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ముంబైలో ప్రజలు ప్రసిద్ధ క్రీడ దహీ హండిలో మునిగితేలుతుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గర్భిణీలు గాలి కాలుష్యానికి గురైతే.. చిన్నారుల్లో ఆ సమస్య
గర్భిణీలు గాలి కాలుష్యానికి గురైతే.. చిన్నారుల్లో ఆ సమస్య
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
అమ్మ బాబోయ్‌.. వీడి చోరకళ మామూలుగా లేదుగా!
అమ్మ బాబోయ్‌.. వీడి చోరకళ మామూలుగా లేదుగా!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
కోనసీమ తిరుమల వాడపల్లిలో దైవభక్తితో పాటు దేశభక్తి..ఇవిగో ఆనవాళ్లు
కోనసీమ తిరుమల వాడపల్లిలో దైవభక్తితో పాటు దేశభక్తి..ఇవిగో ఆనవాళ్లు
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రెప్పపాటులో నిండి గర్భిణికి తప్పిన ముప్పు!
రెప్పపాటులో నిండి గర్భిణికి తప్పిన ముప్పు!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్..
క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్..
ఏంటి సూర్య.! మరీ అంత తక్కువా.? ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న న్యూస్.
ఏంటి సూర్య.! మరీ అంత తక్కువా.? ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న న్యూస్.