Chaiwali Tea Stall: గ్రాడ్యుయేట్ చాయ్‌వాలి టీ స్టాల్ ను తొలగించిన అధికారులు.. పోరాడి తిరిగి సాధించుకున్న ప్రియాంక

గురువారం, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ నగర్ ఆక్రమణల నిరోధక డ్రైవ్‌లో భాగంగా ప్రియాంక గుప్తా స్టాల్‌ను తొలగించింది. జీవనోపాధి కోల్పోవడంతో ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. 

Chaiwali Tea Stall: గ్రాడ్యుయేట్ చాయ్‌వాలి టీ స్టాల్ ను తొలగించిన అధికారులు.. పోరాడి తిరిగి సాధించుకున్న ప్రియాంక
'graduate Chaiwali
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:22 PM

Graduate Chaiwali: బీహార్‌లో గ్రాడ్యుయేట్ చాయ్‌వాలిగా ప్రసిద్ధి చెందిన పాట్నాకు చెందిన ప్రియాంక గుప్తా స్టాల్‌ను మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి ఇచ్చింది. జీవనోపాధి కోసం ప్రియాంక నడుపుతున్న టీ స్టాల్ ను మున్సిపల్ అధికారులు తీసివేయడంతో వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు ప్రియాంక తనకు సాయం చేయమంటూ.. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌లను కలిశారు. తేజస్వి యాదవ్.. ప్రియాంకకు సాయం చేస్తానని హీమీనిచ్చారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చొరవతో ఆదేశాల మేరకు ప్రియాంకా గుప్తా టీ స్టాల్‌ను మున్సిపల్​ అధికారులు పునరుద్ధరించారు. దీంతో ప్రియాంక సంతోషం వ్యక్తం చేసింది. తేజస్వి యాదవ్‌ను కలిసిన అనంతరం ప్రియాంక గుప్తా మాట్లాడుతూ. తనను టీ స్టాల్ రన్ చేసుకోవానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోమని తేజస్వి సూచించారని తెలిపింది.

బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ నుండి కామర్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.  సుమారు రెండు ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడినా.. ఉద్యోగం రాకపోవడంతో ప్రియాంక స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసింది. ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరిట పాట్నాబోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ, భోజ్‌పురి సినిమా నటి అక్షర సింగ్ లు  ప్రియాంక షాప్ ‘గ్రాడ్యుయేట్ చైవాలీ’ వద్ద సందడి చేశారు. ప్రియాంకకు మంచి పేరు వచ్చింది.

అయితే గురువారం, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ నగర్ ఆక్రమణల నిరోధక డ్రైవ్‌లో భాగంగా ప్రియాంక గుప్తా స్టాల్‌ను తొలగించింది. జీవనోపాధి కోల్పోవడంతో ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!