AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: తాజ్ మహల్ ఫోటో మీ ఇంట్లో ఉందా?.. ప్రేమ సంగతేమో కానీ, కష్టాలు మాత్రం క్యూ కడతాయి జాగ్రత్త!

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అంటే తెలియని వారుండరు. షాజహాన్ తన భార్య ముంతాజ్ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ అద్భుత కట్టడం.. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది తమ ఇళ్లను అందంగా మార్చుకోవడానికి తాజ్ మహల్ చిత్రాలను లేదా షోపీస్‌లను వాడుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలు శుభప్రదం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎంత అందంగా ఉన్నా, ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు.

Vastu Tips: తాజ్ మహల్ ఫోటో మీ ఇంట్లో ఉందా?.. ప్రేమ సంగతేమో కానీ, కష్టాలు మాత్రం క్యూ కడతాయి జాగ్రత్త!
Taj Mahal Vastu Tips 2026
Bhavani
|

Updated on: Mar 03, 2026 | 6:10 PM

Share

మనం ఇంట్లో ఉంచుకునే వస్తువులు మన మనస్తత్వం మీద, అదృష్టం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజ్ మహల్ చూడటానికి ప్రేమకు చిహ్నంగా కనిపించినా, వాస్తవానికి అది ఒక సమాధి. హిందూ సంప్రదాయాల ప్రకారం, మరణానికి లేదా స్మశాన వాటికలకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతాయని నమ్మకం. అసలు తాజ్ మహల్ చిత్రాన్ని ఎందుకు ఇంట్లో ఉంచకూడదు? అది ఎలాంటి ప్రతికూలతను తెస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. అది ఒక స్మారక చిహ్నం (సమాధి)

తాజ్ మహల్ ఎంత అద్భుతమైన కట్టడం అయినప్పటికీ, అది ముంతాజ్ మహల్ సమాధి. వాస్తు శాస్త్రం ప్రకారం, సమాధులు లేదా మరణంతో ముడిపడి ఉన్న వస్తువుల చిత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది కుటుంబంలో ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

2. పురోగతికి ఆటంకం

అందంగా ఉందని తాజ్ మహల్ ఫోటోను గోడకు తగిలించడం లేదా షోపీస్‌ను హాల్‌లో ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల ఎదుగుదల కుంటుపడుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం చేస్తున్న పనులలో ఆటంకాలు రావడం వంటివి జరుగుతాయి.

3. ఆరోగ్య సమస్యలు

సమాధుల వంటి వస్తువుల ప్రతిరూపాలు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇవి ఇంట్లోని వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల అనవసరమైన భయం, దిగులు మరియు తరచూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

4. బహుమతిగా ఇవ్వడం కూడా తప్పే!

చాలామంది తాజ్ మహల్‌ను ప్రేమకు గుర్తుగా పెళ్లిళ్లకు లేదా ఇతర శుభకార్యాలకు బహుమతిగా ఇస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది అశుభం. ఎవరికైనా సమాధిని బహుమతిగా ఇవ్వడం వల్ల వారి జీవితంలో దుఃఖం మరియు ఇబ్బందులు పెరుగుతాయని నమ్మకం. అందుకే ఇలాంటి బహుమతులకు దూరంగా ఉండటం మంచిది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వాస్తు ఫలితాలు అనేవి మీ వ్యక్తిగత నమ్మకాలు ఇంటి దిశలపై ఆధారపడి ఉంటాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే అనుజ్ఞాత వాస్తు పండితులను సంప్రదించడం శ్రేయస్కరం.

Follow Us
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!