AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2022: పిక్ ఆఫ్ ది రాఖీ ఫెస్ట్.. సైనికుడి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళ.. కన్నీరు పెట్టించే కథ ఏమిటంటే..

సెలబ్రెటీలు, రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకూ రాఖీ పండగను అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. అయితే తాజాగా ఓ సోదరి.. తన సోదరికి రాఖీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాదు.. ఆ చిత్రం.. చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవింపజేసి .. కంట కన్నీరు పెట్టేలా చేస్తుంది.

Raksha Bandhan 2022: పిక్ ఆఫ్ ది రాఖీ ఫెస్ట్.. సైనికుడి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళ.. కన్నీరు పెట్టించే కథ ఏమిటంటే..
Rakhi Festival
Surya Kala
|

Updated on: Aug 12, 2022 | 1:15 PM

Share

Raksha Bandhan 2022: అన్నదమ్ములకు రాఖీ కట్టే శుభసమయం కోసం అక్క చెల్లెల్లు ఏడాది కాలం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున సోదరుడి రాఖీని కట్టి.. వారి నుంచి రక్షణ కోరుతూ సంతోషము వ్యక్తం చేస్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సెలబ్రెటీలు, రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకూ రాఖీ పండగను అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. అయితే తాజాగా ఓ సోదరి.. తన సోదరికి రాఖీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాదు.. ఆ చిత్రం.. చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవింపజేసి .. కంట కన్నీరు పెట్టేలా చేస్తుంది. దేశ రక్షణ కోసం సరిహద్దు ప్రాంతాల్లో కావలా కాస్తూ.. శత్రువుల చేతిలో అమరుడయ్యాడు ఓ జవాన్.. అతని విగ్రహానికి రాఖి పండగ సందర్భంగా సోదరి రాఖీ కట్టింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

వేదాంత్ బిర్లా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టిన హృదయాన్ని కదిలించే చిత్రం కనిపిస్తుంది. ఈ ఫొటోలో ఆర్మీ జవాన్ విగ్రహం కనిపిస్తుంది. తుపాకీ పట్టుకుని గుండెల నిండా దైర్యం నింపుకున్న తన సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రాఖీ రోజున రాఖీ కట్టింది. ఆ సైనికుని పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. జోధ్‌పూర్‌లోని ఓసియన్‌లోని ఖుడియాల గ్రామానికి చెందిన గణపత్ జమ్మూ కాశ్మీర్‌లో శత్రువులను అడ్డుకునే సమయంలో 24-09-2017న ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతుడు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన షాహీద్ గణపత్ కి గుర్తుగా రాజస్థాన్ లో విగ్రహం ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ గణపత్ మణికట్టుకు రాఖీ కట్టి, ‘రక్ష’ సారాన్ని గౌరవించింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసేవ చేస్తోన్న సైనికులకు సలాం కొట్టారు.

Rakhi Pic Viral News

Rakhi Pic Viral News

ఈ పోస్ట్ 3k పైగా కామెంట్స్ ను సొంతం చేసుకుంది. దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనిక సిబ్బందికి అనేక మంది నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..