AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

Airtel 5G: భారత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. టెలికాం రంగ సంస్థలు 5జీ సేవలను లాంచ్‌ చేయడానికి సర్వం...

Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 26, 2022 | 2:59 PM

Share

Airtel 5G: భారత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. టెలికాం రంగ సంస్థలు 5జీ సేవలను లాంచ్‌ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే టెలికం రంగంలో దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేయనుంది. ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రం వేలంలో ఈ దిగ్గజ టెలికం సంస్థ.. 19867.8MHzని రూ. 43,084 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎయిర్‌టెల్‌ 5జీతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఎయిర్‌టెల్‌ 5జీ ధరలు ఎలా ఉండనున్నాయి లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం..

ఇప్పటికే దేశ వ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న కంపెనీగా ఎయిర్‌టెల్‌ పేరు తెచ్చుకుంది. గత పదేళ్ల కాలంలో ఎయిర్‌టెల్‌ మంచి స్పెక్ట్రమ్‌ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తోంది. ఈ కారణంగా ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం 1800/2100/2300 Ghz బ్యాండ్‌ను కలిగి ఉంది. దీని కారణంగానే తక్కువ ధరకే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కంపెనీలతో పోల్చితే స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు ఎయిర్‌టెల్‌లో చాలా తక్కుగా ఉండనున్నాయి.

5జీ స్పెక్ట్రం కొనుగోలు విషయమై భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. ‘5జీ వేలం ఫలితాలతో ఎయిర్‌టెల్ ఆనందంగా ఉంది. మా పోటీ కంపెనీతో పోల్చితే తక్కువ ధరకు స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేయడం మా స్ట్రాటజీలో భాగం. వేగం, కవరేజ్‌ విషయంలో భారత్‌లో మేము మెరుగైన 5జీ సేవలను అందిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాము. భారత తయారీ, సేవ రంగాల్లో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్‌ వీలైనంత త్వరగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదట దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎయిర్‌టెల్‌ ఆగస్టులోనే 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఎరిగ్జన్‌, నోకియా, సామ్‌సంగ్‌ వంటి కంపెనీలో ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకుంది.

Airtel తయారీ, రిటైల్‌, టెక్నాలజీ, హెల్త్‌ కేర్‌ రంగాల్లో 5జీ వినియోగం విషయంలో ఎయిర్‌టెల్‌ గత కొన్నేళ్లుగా పలు మల్టీ నేషనల్‌ కంపెనీలతో కలిసి పని చేస్తుంది. భారత్‌లోనే తొలి 5జీ ఆధారిత అంబులెన్స్‌ కోసం అపోలోతో, తయారీ రంగంలో బోష్‌తో కలిసి ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకుంది.

గ్రామీణ ప్రాంతంలో మొదటి సారి 5జీ పరీక్ష నిర్వహించిన కంపెనీగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. అదే విధంగా గతేడాది 700 Mhz బ్యాండ్‌తో 5జీ పరీక్షను నిర్వహించిన కంపెనీ కూడా ఎయిర్‌టెల్‌ కావడం విశేషం. అంతేకాకుండా ఇండియాలో క్లౌడ్‌ గేమింగ్‌పై టెస్టింగ్ నిర్వహించింది. తొలి లైవ్‌ 5జీ స్పీడ్‌ హోలోగ్రామ్‌ను కూడా ఎయిర్‌టెల్‌ తీసుకురానుంది.

Disclaimer: This is a partnered post

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..