ISRO SSLV Launch: నింగిలోకి దూసుకెళ్లిన స్మాల్ శాటిలైట్.. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? ఇదే సస్పెన్స్..
ISRO SSLV Launch: స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్- D1 నింగిలోకి దూసుకెళ్లింది. SSLV-D1 నాలుగు దశలు దాటుకుని ముందుకెళ్లింది. అయితే టెర్మినల్ దశలో కొంత డేటా మిస్ అయింది. మిషన్ తుది ఫలితాన్ని..
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్- D1 నింగిలోకి దూసుకెళ్లింది. SSLV-D1 నాలుగు దశలు దాటుకుని ముందుకెళ్లింది. అయితే టెర్మినల్ దశలో కొంత డేటా మిస్ అయింది. మిషన్ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి సమాచారాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమైంది ఇస్రో సిబ్బంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈరోజు ఉదయం 9.18 గంటలకు తన మొదటి ‘స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్’ను ప్రయోగించింది. SSLV-D1 మూడు స్టెప్పులు అనుకున్నట్లుగా ముగిశాయి. అయితే.. టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగిందన్నారు. మిషన్ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి తాము సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లుగా తెలిపారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? పరిశీలిస్తున్నామన్నారు. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ప్రయోగం పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తామన్నారు చైర్మన్ సోమనాథ్.
ఈ మిషన్‌ను SSLV-D1/EOS-02 అని పిలుస్తారు. ఇస్రో రాకెట్ SSLV-D1 శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరింది. ఈ రాకెట్ గతంలో ‘మైక్రోసాటిలైట్-2A’గా పిలిచే ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-02’ (EOS-02)ను మోసుకెళ్తోంది, గరిష్టంగా 500 కిలోల వరకు సరుకును మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీని బరువు దాదాపు 142 కిలోలు.
750 మంది గ్రామీణ విద్యార్థులు రూపొందించిన ‘ఆజాదీ సెట్’ను కూడా ప్రారంభించారు. SSLV ఉపగ్రహం ఆరు మీటర్ల రిజల్యూషన్‌తో కూడిన ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను కూడా తీసుకువెళ్లింది. దీనిలో SpaceKidz ఇండియా నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు రూపొందించిన ఎనిమిది కిలోల Azadi Sat ఉపగ్రహం కూడా ఇందులో ఉంది. స్పేస్‌కిడ్జ్ ఇండియా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఏమిటంటే, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిర్వహించింది.
SSLV-D1/EOS-02 Mission: Maiden flight of SSLV is completed. All stages performed as expected. Data loss is observed during the terminal stage. It is being analysed. Will be updated soon.
— ISRO (@isro) August 7, 2022
మిషన్ ఎందుకు ప్రత్యేకమైనది?
దేశంలోనే తొలి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం ఇదే. అంతకుముందు, చిన్న ఉపగ్రహాలు సన్ సింక్రోనస్ ఆర్బిట్ కోసం PSLVపై ఆధారపడి ఉన్నాయి. అయితే పెద్ద మిషన్లు జియోసింక్రోనస్ ఆర్బిట్ కోసం GSLV, GSLV మార్క్ 3ని ఉపయోగించాయి. పీఎస్‌ఎల్‌వీని లాంచ్ ప్యాడ్‌కు తీసుకొచ్చి అసెంబుల్ చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుండగా, కేవలం 24 నుంచి 72 గంటల్లోనే ఎస్‌ఎస్‌ఎల్‌వీని అసెంబుల్ చేయవచ్చు. అలాగే, ఇది ట్రాక్ వెనుక లోడ్ అవుతున్నా లేదా మొబైల్ లాంచ్ వెహికల్‌లో లాంచ్ చేసినా లేదా ఏదైనా రెడీమేడ్ లాంచ్ ప్యాడ్‌లో లాంచ్ చేసినా ఎప్పుడైనా, ఎక్కడైనా లాంచ్ అయ్యే విధంగా రూపొందించబడింది.