ఇన్ స్టా రీల్స్‌తో సినిమా ఛాన్స్.. తొలి మూవీనే స్టార్ హీరోతో.. ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.?
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో పాపులర్ అవుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్ తెచ్చుకుంది .

ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కాలంటే ఆడిషన్లు తప్పనిసరిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్‌స్టాలో రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయితే చాలు.. మూవీ ఛాన్స్‌లు దక్కుతున్నాయ్. ఇటీవల చాలామంది ఇన్‌స్టాలో రీల్స్ చేయడం ద్వారా ఓవర్‌నైట్‌లోనే తెగ ఫేమస్ అయిపోతున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా క్రేజ్ తో పాపులర్ అయ్యి సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అలా ఇండస్ట్రీలోకి వచ్చినవారే.. ఇక పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.? ఈ క్యూటీ త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ సినిమాతోనే. తొలి సినిమాతోనే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా.?
మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్. మరి ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టేశారా.? ఆమె మరెవరో కాదు.. ఇమాన్వి. ప్రభాస్, దర్శకుడు హను రాఘపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి.. తన చదువును అమెరికాలోని కాలిఫోర్నియాలో పూర్తి చేసింది. అలాగే ఈమె ‘బీయింగ్ సారా’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.
బాలీవుడ్ ఫేమస్ డ్యాన్సర్ ఇషానీ పటేల్‌తో డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో తెగ ఫేమస్ అయింది ఇమాన్వి. అలాగే సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. ఈ అందాల భామకు దర్శకుడు హను రాఘవపూడి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్ తో ఆయన చేస్తున్న ఫౌజీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. దాంతో ఈమె ఎవరు.? అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి ఫోటోలు తెగ ఫేమస్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




