కొత్త ఇయర్‌ బడ్స్‌ కొనాలంటే.. ఈ చెక్ చెయ్యండి.. 

Prudvi Battula 

Images: Pinterest

29 November 2025

ఇయర్‌ బడ్స్‌ కొనే ముందు కచ్చితంగా బ్యాటరీని పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ ప్లే బ్యాకప్‌ ఉండే ఇయర్‌ బడ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. వైర్‌లెస్‌తో ఉంటాయి కాబట్టి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండే వాటిని ఎంచుకోవాలి.

బ్యాటరీ కెపాసిటీ

ఇక బ్లూటూత్ రేంజ్‌ను కూడా చూసుకోవాలి. లేటెస్ట్‌ వెర్షన్‌ బ్లూటూత్ ఉన్న ఇయర్‌ బడ్స్‌ కొనుగోలు చేసుకోవాలి. దీంతో ఫోన్‌కు అత్యంత వేగంగా పెయిర్‌ చేసుకోవచ్చు.

బ్లూటూత్ రేంజ్‌

ఇయర్‌ బడ్స్‌ విషయంలో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కూడా చూసుకోవాలి. స్పష్టమైన ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవడంలో ఈ టెక్నాలజీ ఉపయోపగడుతుంది.

నాయిస్‌ క్యాన్సిలేషన్‌

ఆడియో, వీడియోను సింక్‌ చేసే లేటెన్సీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. గేమ్స్‌ ఆడుకునే వారు, సినిమాలు చూసే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఆడియో, వీడియోను సింక్‌

బయట వచ్చే శబ్ధాలు వినపడకుండా ఉండాలంటే ఎన్విరానిమెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్ ఉపయోగపడుతుంది. కొత్త ఇయర్‌ బడ్స్‌ను కొనేవారు దీనిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఎన్విరానిమెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌

ప్రస్తుతం టచ్‌ సెన్సిటివ్‌తో కూడిన ఇయర్‌ బడ్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. వీటితో కాల్స్‌ లిఫ్ట్‌, సాంగ్స్‌ పాజ్‌ అండ్ ప్లే చేసుకోవడం వంటివి క్లిక్‌తో చేసుకోవచ్చు.

టచ్‌ సెన్సిటివ్‌

ఇక ఫీచర్లన్నింటీతో పాటు ఇయర్‌ బడ్స్‌ కంఫర్ట్‌గా ఉన్నాయా లేవో కూడా చూసుకోవాలి. ఇయర్‌ బడ్స్‌ చేవుల్లో సరిగ్గా సెట్ అవుతున్నాయో లేదో సరిచూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు.

కంఫర్ట్‌

ఇవన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన ఇయర్‌ బడ్స్‌ తీసుకొంటే.. మీరు అస్సలు నిరాశ చెందారు. హ్యాపీగా వాటిని వాడుకుంటారు.

ఇయర్‌ బడ్స్‌