ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..
Prudvi Battula
Images: Pinterest
14 November 2025
1 టీస్పూన్ బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకొని వారానికి రెండుసార్లు 2 నిమిషాలు సున్నితంగా బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా మారుతాయి.
బేకింగ్ సోడా
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె నోట్లో వేసుకొని 10–15 నిమిషాలు పుక్కిలించి ఉమ్మివేయండి. దీనికి కొంచెం ఓపిక అవసరం కానీ దంతాలు తెల్లబడటం పక్కా.
కొబ్బరి నూనె
1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను అర కప్పు నీటిలో వేసి 30 సెకన్ల పాటు పుక్కిలించండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
మీ టూత్ బ్రష్‌ను తడిపి, పొడి చేసిన యాక్టివేటెడ్ చార్‌కోల్‌లో ముంచి 1–2 నిమిషాలు మెల్లగా బ్రష్ చేసి బాగా శుభ్రం చేసుకొంటే దంతాలు తెల్లగా మారుతాయి.
చార్‌కోల్
రోజుకు రెండుసార్లు బ్రష్ చెయ్యడం అలవాటు చేసుకోండి. అలాగే రోజుకు ఒకసారి దంతాలు ఫ్లాసింగ్ చేస్తే సహజ తెల్లదనాన్ని పొందవచ్చు.
ఫ్లాసింగ్
మీ దంతాలు ఎప్పుడు తెల్లగా కనిపించాలంటే కాఫీ, టీలు లాంటివి తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే మంచిది.
స్ట్రాతో కాఫీ, టీలు
స్మోకింగ్ కారణంగా కూడా దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. మీ ఈ అలవాటు ఉంటె మాత్రం వెంటనే మానుకోవడం మంచిది.
స్మోకింగ్ మానుకోవాలి
దంతాలను సహజంగా తెల్లగా మార్చుకోవడం మంచిదే. కానీ మీ దంతాలు బాగా రంగు మారితే మాత్రం దంతవైద్యుడిని సంప్రదించడం మంచిది.