Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: మరికాసేపట్లో ఆజాదీశాట్‌తో నింగికి దూసుకెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. ఇస్రో మరో ఘనకీర్తి..

Mini Rocket SSLV: కమర్షియల్‌ రాకెట్‌ ప్రయోగాల్లో నెంబర్‌ వన్‌లో ఉన్న ఇస్రో.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. తక్కువ సమయంలో కమర్షియల్‌ ప్రయోగాలను చేపట్టేందుకు మినీ రాకెట్‌ వాహక నౌక SSLVని రూపకల్పన చేసింది.

ISRO: మరికాసేపట్లో ఆజాదీశాట్‌తో నింగికి దూసుకెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. ఇస్రో మరో ఘనకీర్తి..
Sslv
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 07, 2022 | 7:19 AM

ఇస్రో మరో ఘనకీర్తిని తన ఖాతాలో వేసుకోబోతోంది. ఇప్పటికే కమర్షియల్‌ రాకెట్‌ ప్రయోగాల్లో నెంబర్‌ వన్‌లో ఉన్న ఇస్రో.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. తక్కువ సమయంలో కమర్షియల్‌ ప్రయోగాలను చేపట్టేందుకు మినీ రాకెట్‌ వాహక నౌక SSLVని రూపకల్పన చేసింది. భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని రికార్డ్ చేసింది. సుళ్లూరుపేటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ తొలి ప్రయోగ వేదిక నుంచి మరికాసేపట్లో స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌-SSLV-D1ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు పూర్తి చేసిన అధికారులు.. రాత్రి 2 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. ఈ ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహిస్తున్నారు.

చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా SSLV-D1ను ఇస్రో చాలా ప్రత్యేకంగా రూపొందించింది. 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌.. ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తుంది. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2A ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు.. దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ను కూడా ఇందులో   ప్రయోగిస్తున్నారు.

ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్‌ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం ఇది కావడం విశేషం. ఈ SSLV-D1 ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి.. అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీది వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని మనకు చేరవేస్తుంటుంది.

అయితే ఈ చిన్న ఉపగ్రహం ఆజాదీ శాట్‌ బరువు 8 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్‌ కౌంటర్లు, సోలార్‌ ప్యానల్‌ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లు ఇందులో ఏర్పాటు చేశారు . అయితే ఈ ఉపగ్రహం కేవలం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ఎస్ట్రీమ్ ఇన్ స్పెస్ గా పిలుస్తున్నారు. ఇందులో భాగం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌లో ప్రత్యేకించి మహిళలను ప్రోత్సహించేందుకు ఈ తొలి అంతరిక్ష మిషన్‌‌ను ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్‌ షరూక్‌ అనే మహిళ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.  750 మంది గ్రామీణ విద్యార్థినిలతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు రిఫాత్‌ షరూక్‌.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం..