- Telugu News Photo Gallery Technology photos Realme launching new 5g budget smartphone Realme 9i 5g price and features Telugu Tech News
Realme 9i 5G: బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.? రూ. 15 వేలలో రియల్‌మీ 9ఐ ఫోన్..
Realme 9i 5G: అక్టోబర్‌లో ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో రియల్‌మీ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ 9ఐ పేరుతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ ఆగస్టు 18తేదీన లాంచ్ కానుంది..
Updated on: Aug 06, 2022 | 6:55 PM

భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 5జీ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా రియల్‌మీ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మొత్తం మూడు కలర్స్‌లో ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.

6.7 ఇంచెస్ డిస్‌ప్లేను అందించిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 18వ తేదీన దీనిపై క్లారిటీ రానుంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్, 8, 2 ఎంపీలతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న సమయంలో బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది.




