- Telugu News Photo Gallery Technology photos Oppo Launches new smart phone Oppo a77 features and price details Telugu Tech News
Oppo a77: తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్..
Oppo a77: ఒప్పో తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. పేరు బడ్జెట్ ఫోన్ అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడలేదు. 50 మెగా పిక్సెల్స్ కెమెరాతో పాటు మరెన్నో ఆసక్తికర ఫీచర్లను అందించారు..
Updated on: Aug 05, 2022 | 9:46 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి బడ్జెట్ ఫక్షన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ77 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చారు.

ఒప్పో ఏ77 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

బ్యాటరీ విషయానికొస్తే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. దీంతో ఫోన్ చార్జింగ్ వేగంగా అవుతుంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేశారు. ధర విషయానికొస్తే రూ. 15,499కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా పలు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.




