Varalakshmi Vratham: పౌర్ణమి, శుక్రవారం.. ఈ నేపథ్యంలో 12వ తేదీన వరలక్ష్మి వ్రతానికి ప్రాముఖ్యత ఉందంటున్న పురోహితులు

ఆగష్టు 12వ తేదీ శుక్రవారం రోజు పౌర్ణమి తిథి కూడా కలిసి వచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 12న వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైందిగా పరిగణింపబడుతుంది. ఈ పూజకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..   

Varalakshmi Vratham: పౌర్ణమి, శుక్రవారం.. ఈ నేపథ్యంలో 12వ తేదీన వరలక్ష్మి వ్రతానికి ప్రాముఖ్యత ఉందంటున్న పురోహితులు
Varalakshmi Vratam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 08, 2022 | 8:57 AM

Varalakshmi Vratham: శ్రావణ మాసంలోని మూడో శుక్రవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం  వరలక్ష్మికి అంకితం చేయబడింది.  వరలక్ష్మి దేవి క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిందని నమ్ముతారు. గ్రంథాలలో వరలక్ష్మి అమ్మవారి  రూపాన్ని చాలా ఆకర్షణీయంగా వర్ణించారు. ఆమె రూపాన్ని వివరిస్తూ.. వరలక్ష్మి అమ్మవారు క్షీరవర్ణంలో స్వచ్ఛమైన నీటి వంటిది, పదహారు అలంకారాలతో అలంకరించబడిందని చెబుతారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. పేదరికం, ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయని నమ్మకం. అంతేకాదు.. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు తరాల కాలం పాటు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాయి. అయితే శుక్రవారం రోజు పౌర్ణమి తిథి కూడా కలిసి వచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 12న వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైందిగా పరిగణింపబడుతుంది. ఈ పూజకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ: ఈ సారి వరలక్ష్మీ వ్రతంతో పాటు శ్రావణ పౌర్ణమి కూడా కలిసొచ్చినందున వరలక్ష్మీ వ్రతానికి ప్రాధాన్యత పెరిగింది. శుక్రవారం ఉదయం 11.34 గంటలకు సౌభాగ్యయోగం ఉండి అనంతరం శోభనయోగం ప్రారంభమవుతుంది. హిందూ మతపరంగా, ఈ రెండు యోగాలు శుభప్రదంగా పరిగణించబడుతున్నాయి. అందుకనే వ్రతం చేయడానికి ఉదయం 06:14 నుండి 08:32 వరకు, మధ్యాహ్నం 01:07 నుండి సాయంత్రం 03:26 వరకు సాయంత్రం 07:12 నుండి 08:40 వరకు శుభ ముహూర్తాలు.

ఉపవాసం ప్రాముఖ్యత: దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో చేస్తారు. ఈ వ్రతం చేయడం వలన అష్టలక్ష్మిని పూజించినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పేదరికం తొలగిపోయి కుటుంబంలో సౌభాగ్యం, సంతోషం, సంతానం అన్నీ లభిస్తాయి. ఈ వ్రతం ప్రభావంతో తరతరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఎలా పూజ చేయాలంటే:  శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఉపవాస వ్రతం నియమాలు మొదలు పెట్టండి. పూజ కోసం పీఠాన్ని ఏర్పరచి.. ఎర్రటి వస్త్రం పరచి దానిపై లక్ష్మీ దేవి , గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. అనంతరం పసుపు, కుంకుమ, చందనం, పరిమళం, ధూపం, వస్త్రాలు, కలువ పువ్వులు, అక్షతలు, నైవేద్యాలను సమర్పించండి. గణపతికి నెయ్యి, అమ్మవారికి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.  అనంతరం గణపతి పేరు తో మంత్రాన్ని జపించండి. అనంతరం వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ప్రారంభించండి. తామర పువ్వుల దండ,  స్ఫటిక హారముతో లక్ష్మీ దేవి మంత్రాన్ని జపించండి. వరలక్ష్మీ వ్రత కథ చదవండి లేదా వినండి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి.

వరలక్ష్మీ వ్రత కథ పురాణాల ప్రకారం మగధ దేశంలో కుండి అనే నగరం ఉండేది. ఈ నగరంలో చారుమతి అనే స్త్రీ నివసించేది. చారుమతి లక్ష్మిదేవికి గొప్ప భక్తురాలు. ప్రతి శుక్రవారం అమ్మవారి కోసం ఉపవాసం ఆచరించేది. ఒకరోజు చారుమతి కలలో లక్ష్మీదేవి కనిపించి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని కోరింది. చారుమతి తల్లి ఆజ్ఞను అనుసరించి ఉపవాసం పాటించింది. ఉపవాసం ముగియగానే చారుమతి భవితవ్యం మారిపోయింది. ఆమె శరీరం బంగారు ఆభరణాలతో నిండిపోయింది. ఇల్లు డబ్బు , ధాన్యాలతో నిండిపోయింది. చారుమతిని చూసి ఆ ప్రాంతంలోని ఇతర స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని పాటించడం ప్రారంభించారు. క్రమక్రమంగా, దక్షిణ భారతదేశంలో ఈ వ్రతానన్నీ ఆచరించడం సంప్రదాయంగా మారింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..