Horoscope Today: ఈ రాశివారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 8వ  తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఈ రాశివారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Aug 08, 2022 | 6:23 AM

Horoscope Today (08-08-2022) రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా.. ప్రయాణాలు చేయాలన్నా రోజులో తమకు ఎలా ఉంటుందో అంటూ మంచి చెడులను గురించి  ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 8వ  తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు జరిగే అవకాశం ఉంది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.   కొన్ని కీలక వ్యవహారాల్లో  జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. శుభ కాలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగితే.. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బాధను  కలిగించే వార్తను వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ముఖ్యమైన విషయంలో పెద్దల సలహాలను సూచనలు తీసుకోవడంతో పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలను అందుకుంటారు. మానసికంగా ప్రశాంతంతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒత్తిడిని దరిచేరనీయకుండా పనులు చేయాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులను మానసిక ప్రశాంతత కోల్పోకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో  క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగిన ఖర్చులను చేస్తారు. ఇతరులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మనసు ఇతర పనుల మీదకు వెళ్లకుండా చూసుకోవాలి. అభిప్రాయం బేధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆయా రంగాల్లో ప్రోత్సాహాన్ని అందుకుంటారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి సాయం అందుకుంటారు. అతిగా ఎవరినీ నమ్మి పనులను చేపట్టరాదు. చిత్త శుద్ధితో చేపట్టిన పనులు విషయంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆర్థికాంశాలతో  మీ పరిధిని దృష్టిలో పెట్టుకోవాలి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ఫలితం అందుకుంటారు. మిశ్రమ కాలం. కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది.  బంధు,మిత్రుల వల్ల ధనవ్యయం పెరుగుతుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో వాదనలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు శుభఫలితాలను అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు తమ బుద్ధి బలంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికీ కష్టకాలం. అధికారులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)