Viral Video: శివయ్య మెడలో నాగుపాములా శివలింగాన్ని చుట్టుకున్న నల్లతాచు.. పాలు తాగుతున్న వీడియో వైరల్

భారీ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది. భక్తులకు ఎలాంటి హానీ చేయకుండా శివలింగంపై పోసిన పాలను తాగుతూ శివలింగం వద్దే ఉండిపోయింది. ఇందుకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Viral Video: శివయ్య మెడలో నాగుపాములా శివలింగాన్ని చుట్టుకున్న నల్లతాచు.. పాలు తాగుతున్న వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2022 | 3:20 PM

భూమిని, ప్రకృతిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. పశు పక్షులు, జంతువులు,. పాములు ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూసే నేచర్ మనది.. అంతేకాదు ఆవు, నాగుపాము వంటి వాటిని పూజిస్తాం. నాగుపాముని దైవంగా భావించి నాగుల చవితి, నాగ పంచమి అంటూ వివిధ సందర్భాల్లో పుట్టలో పాలు పోసి.. భక్తిభావంతో వాటిని మొక్కుతాం. శివుడి మెడలో కంఠాభరణంగా   నాగుపాము, విష్ణువు పాన్పుగా ఆదిశేషు ఇలా పాముల గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రస్తావనలో ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు పాములు.. ఆలయం వద్దకు వెళ్లి.. దేవుడి పూజ సమయంలో దర్శినమిచ్చిన వీడియోలు సర్వసాధారణంగా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ భారీ నల్ల తాచు.. శివలింగాన్ని చుట్టుకుని.. పాలుని తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవును ఓ శివాలయంలో శివుడి మెడను చుట్టుకున్నట్లు.. శివలింగాన్ని చుట్టుకుని ఉందో భారీ నల్లతాచు. భక్తులు పాలతో అభిషేకం చేస్తున్న సమయంలో ఆ భారీ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది. భక్తులకు ఎలాంటి హానీ చేయకుండా శివలింగంపై పోసిన పాలను తాగుతూ శివలింగం వద్దే ఉండిపోయింది. ఇందుకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇక భక్తులు కూడా పాలను అత్యంత నెమ్మదిగా, నన్నటి ధారలా పోస్తూ… పాముకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో పూజలను నిర్వహించారు. పాము పాలు తాగుతున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పురాణాల్లో పాములు పాలుతాగుతాయి అంటే.. ఆధునిక సైన్స్ పాములు పాలు తగవు అని అంటున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..