Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఇంట్లో, వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందుల్లా.. శంఖు పుష్పంతో శనిదేవుడిని ఇలా పూజించండి..

శంఖ పుష్పంతో పూజ చేస్తే.. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన  ఇబ్బందులను ఈ శంఖి పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది

Astro Tips: ఇంట్లో, వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందుల్లా.. శంఖు పుష్పంతో శనిదేవుడిని ఇలా పూజించండి..
Astro Tips For Shanku Pushp
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2022 | 3:46 PM

Astro Tips: పూజ చేసే సమయంలో పుష్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలంకారం నుండి దేవతల పూజ వరకు అన్ని పనులలో పువ్వులు ఉపయోగిస్తారు. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి కూడా పేర్కొన్నారు. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనినే కొందరు విష్ణుకాంత, మరికొందరు శంఖ పుష్పం అని కూడా అంటారు. ఈ శంఖ పుష్పానికి దేవుళ్ళకు ప్రీతిపాత్రమైనది నమ్మకం. ముఖ్యంగా శంఖు పుష్పం శని దేవుడితో ఉందని నమ్మకం. ఈ  పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు.. ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు ఈ పుష్పానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన  ఇబ్బందులను ఈ శంఖి పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు శంఖు పుష్పానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం..

కొంత మంది డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు.. ఐదు శంఖ పుష్పాలను  తీసుకుని, వాటిని నదిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందుల సమస్య  తీరుతుంది. డబ్బు కొరత ఉండదు.

ఆర్ధికంగా ఇబ్బందులు ఉంటే.. మంగళవారం నాడు, హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తరువాత.. ఈ పువ్వును తీసుకొని  గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరతాయి.

ఇవి కూడా చదవండి

వ్యాపారంలో నష్టాలు వస్తుంటే.. శంఖు పుష్పం మొక్క వేరును నీలిరంగు గుడ్డలో కట్టి, దుకాణం వెలుపల వేలాడదీయండి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు.

డబ్బు సమస్యను అధిగమించడానికి.. సోమవారం శివలింగానికి శంఖు పుష్పం ఉన్న జలం ని సమర్పించండి.

శనివారం రోజున శని దేవుడికి ఈ పుష్పాలను సమర్పించండి. ఇది మీ జాతకంలో శని స్థానాన్ని బలపరుస్తుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు.

ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే లేదా మీకు చాలా కాలం నుండి ప్రమోషన్ రాకపోతే, అప్పుడు 6 శంఖం పువ్వులు, 5 పటిక ముక్కలను అమ్మవారికి సమర్పించండి. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కూడా జేబులో పటిక ముక్కలను పెట్టుకుని వెళ్లండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,  నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్