Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palmistry: అరచేతిపై ఇలాంటి గుర్తులుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం.. డబ్బుకు లోటు ఉండదు

అరచేతిలో విధి రేఖకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ విధి రేఖ ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో తెలియజేస్తుంది. అదృష్ట రేఖను కలిగి ఉన్న వ్యక్తి  జీవితంలో గౌరవం, విలాసాలు, సుఖాలు, సంపద ,  వైభవాన్ని పొందుతాడు. విధి రేఖ  ఉన్న వ్యక్తి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

Palmistry: అరచేతిపై ఇలాంటి గుర్తులుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం.. డబ్బుకు లోటు ఉండదు
Hand Palmistry
Follow us
Surya Kala

|

Updated on: Aug 02, 2022 | 3:09 PM

Palmistry: హస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేసి.. తద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళ. ఈ విధానం పలు సాంస్కృతిక వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. హస్తసాముద్రికం లో వ్యక్తి అరచేతి లోని రేఖలను “అర్థం చేసుకుని అతని వ్యక్తిత్వం లేదా భవిష్యత్ జీవితం గురించి విశ్లేషిస్తారు.  అరచేతిలోని రేఖలు రకరకాలుగా ఉంటాయి. ఈ రేఖలతో పాటు కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. అరచేతిలో విధి రేఖకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ విధి రేఖ ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో తెలియజేస్తుంది. అదృష్ట రేఖను కలిగి ఉన్న వ్యక్తి  జీవితంలో గౌరవం, విలాసాలు, సుఖాలు, సంపద ,  వైభవాన్ని పొందుతాడు. విధి రేఖ  ఉన్న వ్యక్తి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు అరచేతిలోని ఏ రేఖలు మనిషి జీవితంలో సంతోషాన్ని, సంపదను కలిగిస్తాయో తెలుసుకుందాం.

అరచేతిపై రథం లేదా జెండా గుర్తు ఒక వ్యక్తి తన అరచేతిపై రథం లేదా జెండా లాంటి గుర్తును కలిగి ఉంటే.. అది చాలా పవిత్రమైన గుర్తుగా పరిగణించబడుతుంది. అరచేతిపై ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. జీవితంలో సంపదకు లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

అరచేతిలో చేప గుర్తు హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి అరచేతిపై చేప ఆకారం వంటి గుర్తు ఉంటే..  చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉంటుంది. అంతేకాదు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది. జీవితంలో సుఖ సంపదలు కలిగి ఉంటారు.

ఇవి కూడా చదవండి

సర్కిల్ గుర్తు ఒక వ్యక్తి అరచేతిపై చక్రం వంటి గుర్తు ఉంటే.. శుభ సూచికంగా పరిగణిస్తారు. అరచేతిపై అలాంటి గుర్తు ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ డబ్బుకి ఇబ్బంది పడదు. అలంటి వ్యక్తులకు నాయకత్వం వహించే సామర్థ్యం, విశ్వాసం ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ అదృష్టం వీరితోనే ఉంటుంది. విజయాలు వీరి సొంతం. అంతేకాదు ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తులు తక్కువ సమయంలోనే ఉన్నతస్థానానికి చేరుకుంటారు.

అదృష్ట రేఖ: అరచేతిలో అదృష్ట రేఖ  ఉన్నవారి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. అదృష్ట రేఖను శని రేఖ అని కూడా అంటారు. ఎవరి చేతుల్లో శని రేఖ స్పష్టంగా .. ఎక్కడ కట్ అవకుండా నిటారుగా ఉంటుందో అటువంటి వ్యక్తి జీవితంలో చాలా పేరు సంపాదిస్తాడని నమ్మకం.  అటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,  నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)