- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti in Telugu: these 4 lessons told by chanakya change a persons life there is no shortage of anything
Chanakya Niti: ఈ నాలుగు విషయాలను పాటించి చూడండి.. జీవితంలో దేనికి లోటు ఉండదంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక మార్గాలను చెప్పాడు. ప్రస్తుత కాలంలో కూడా చాణక్య చెప్పిన విషయాలను అనుసరిస్తే. ఆ మనిషి జీవితంలో సమస్యను అధిగమిస్తారు. అంతేకాదు జీవితంలో ఏ విధమైన సమస్యలు ఏర్పడినా పరిష్కారాన్ని ఈజీగా కనుగొంటారు.
Updated on: Jul 23, 2022 | 1:09 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.





























