- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in Telugu: keep these things in mind of acharya chanakya to get prestige and respect
Chanakya Niti: సమాజంలో గౌరవ ప్రతిష్టలు సొంతం చేసుకోవాలంటే ఈ నాలుగు విషయాలను పాటించమంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తే.. అతను చాలా సాధించగలడు. ఆచార్య చాణక్యుడి చెప్పిన ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం, వీటిని అనుసరించడం ద్వారా గౌరవం పెరుగుతుంది.
Updated on: Jul 24, 2022 | 1:05 PM

కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.





























