AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shavarana Masam 2022: ఉజ్జయినిలో శ్రావణమాసంలో మాత్రమే దర్శనమిచ్చే నాగదేవి.. కాలసర్ప దోషం తొలగుతుందని విశ్వాసం

మహాకాళేశ్వర ఆలయంలో ప్రసిద్ధ నాగదేవత ఆలయం ఉంది. ఈ నాగదేవత దర్శనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తుంది.. శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున భక్తులకు దర్శనం లభిస్తుంది.

Shavarana Masam 2022: ఉజ్జయినిలో శ్రావణమాసంలో మాత్రమే దర్శనమిచ్చే నాగదేవి.. కాలసర్ప దోషం తొలగుతుందని విశ్వాసం
Mahakaleshwar Jyotirlinga
Surya Kala
|

Updated on: Jul 23, 2022 | 9:17 AM

Share

Shavarana Masam 2022: శివుడిని పూజించడానికి కార్తీకమాసం ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో.. శ్రావణ మాసం కూడా అంతే విశిష్టమైనది. శ్రావణ మాసంలో విష్ణువు యోగనిద్రలో ఉండడంతో.. శివుడు లోకాలన్నీ రక్షిస్తాడని.. ఈ మాసంలోనే శివపార్వతుల కళ్యాణం జరిగిందని విశ్వాసం. కనుక ఈ మాసంలో శివుడిని శైవక్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణ మాసం రానున్నది, ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగ ఆరాధనకు సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. శివుని 12 జ్యోతిర్లింగాలలో.. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. పురాతన సప్తపురిలలో ఒకటైన.. బాబా మహాకల్ నగరం. ఈ ఉజ్జయిని.. మొత్తం భూమికి కేంద్ర బిందువుగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రంలో కొలువైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినంతనే అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్మకం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం స్వరూపం గురించి, ఆరాధన మతపరమైన ప్రాముఖ్యత విశేషాలను తెలుసుకుందాం..

మహాకాళేశ్వర దేవాలయం ఎక్కడ ఉందంటే: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర ఆలయం ఉంది. పన్నెండవ జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుని పవిత్ర నివాసం ఏడు పురాతన నివాసాలలో ఒకటి అవంతిక లేదా ఉజ్జయిని. దేవాలయాల నగరం అని పిలువబడే ఈ పవిత్ర నగరాన్ని సందర్శించినప్పుడు.. ఇక్కడ లయకారుడు శివ్డుడిని మాత్రమే కాదు.. 51 శక్తిపీఠాలలో ఒకటైన హరిసిద్ధి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ కథ పురాణాల ప్రకారం.. ఒకప్పుడు పురాతన ఉజ్జయినీ నగరంలో వేద అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు నివసించాడు, అతను ప్రతిరోజూ శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. ఈ నగరానికి సమీపంలో రత్నమన్ పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడు నివసించేవాడు. ఆ రాక్షసుడు తరచూ శివుని సాధన చేసేవారిని ఇబ్బంది పెట్టేవాడు. దీంతో కలత చెందిన బ్రాహ్మణులు శివుడిని ప్రార్థించారు. ఒక రోజు బ్రాహ్మణులపై రాక్షసుడు దాడి చేశాడు. అప్పుడు శివుడు భూమిని చీల్చికుని మరీ తన భక్తులను రక్షించుకోవడానికి ప్రత్యక్షమయ్యాడు. రాక్షస సహారం చేసి.. తన భక్తులను రక్షించుకున్నాడు. అప్పుడు తన భక్తుల కోరికపై.. శివుడు ఈ ప్రదేశంలో కాంతి రూపంలో వెలిశాడని పురాణాల కథనం.

ఇవి కూడా చదవండి

ఏడాదిలో ఒకసారి నాగ్ దేవత దర్శనం మహాకాళేశ్వర ఆలయంలో ప్రసిద్ధ నాగదేవత ఆలయం ఉంది. ఈ నాగదేవత దర్శనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తుంది.. శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున భక్తులకు దర్శనం లభిస్తుంది. నాగపంచమి రోజున నాగచంద్రేశ్వరుని దర్శనం వల్ల మనిషి పాపాలు, విష సర్పాల భయాల నుంచి విముక్తుడవుతాడని ప్రతీతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నాగచంద్రేశ్వరుడిని పూజించడం ద్వారా, జాతకంలో ఉన్న కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది.

హరసిద్ధి దేవి అమ్మవారు: ఉజ్జయిని నగరం శివుని మహాకాళ రూపాన్ని ఆరాధించడమే కాకుండా, ప్రపంచ ప్రసిద్ధ హరిసిద్ధ మాత యొక్క శక్తిపీఠం కూడా ఉన్నందున శక్తి ఆరాధనకు కూడా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం, సతీదేవి మోచేయి ఇక్కడ పడింది. ఈ హరిసిద్ధి ఆలయంలో రాజు విక్రమాదిత్యుడు తన తలను 12 సార్లు సమర్పించాడని ప్రతీతి.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భస్మ హారతి పరమశివుని ఈ పవిత్ర క్షేత్రం అన్ని రకాల పూజలకే కాకుండా ఇక్కడ జరిగే భస్మ హారతికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న భస్మ హారతిని ఆవు పేడతో చేసిన భస్మంతో ప్రతిరోజు నిర్వహిస్తారు. దీన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

మహాకాళేశ్వర ఆరాధన మతపరమైన ప్రాముఖ్యత సనాతన సంప్రదాయంలో మహాకాళేశ్వర ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. తంత్ర-మంత్ర సాధన కోసం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జాతకచక్రంలో కాలసర్ప దోషం నుండి జీవితానికి సంబంధించిన విపత్తులను తొలగించడానికి మహాకాళేశ్వరుడిని పూజిస్తారు.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఎప్పుడు, ఎలా చేరుకోవాలి మహాకాళేశ్వరుని దర్శనం కోసం.. ఏడాది పొడవునా ఎప్పుడైనా సందర్శించవచ్చు. శివయ్యను పూజించి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ పవిత్ర నగరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా.. నగరానికి చేరుకోవచ్చు. ఉజ్జయిని నగరం దేశంలోని ప్రధాన రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించారు. ఉజ్జయిని నుండి కేవలం 58 కి.మీ దూరంలో ఉన్న ఇండోర్ సిటీ విమానాశ్రయంలో దిగాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..