AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న విదేశీయులు.. అందమైన స్వరంతో హరే రామ హరే కృష్ణ భజన పాడిన విదేశీయుడు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక విదేశీయుడు తన అందమైన స్వరంతో శ్లోకాలు పాడుతూ కనిపించాడు.

Viral Video: హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న విదేశీయులు.. అందమైన స్వరంతో హరే రామ హరే కృష్ణ భజన పాడిన విదేశీయుడు
Viral Video
Surya Kala
|

Updated on: Jul 17, 2022 | 8:50 AM

Share

Viral Video: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మిగిలిన ప్రపంచం కంటే విభిన్నమైనవి. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు మనదేశంలోని ఆలయాలు, క్షేత్రలను, పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి, పూజలను నిర్వహించడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ విదేశాల్లో కృష్ణ మందిరాలను ఏర్పాటు చేసి.. సనాతన ధర్మం వైశిష్ట్యాన్ని పరిచయం చేస్తోన్న నేపథ్యంలో హిందూ సాంప్రాయాలకు విదేశీయలు ఆకర్షితులవుతున్నారు. మధుర-బృందావనంలో ఎప్పుడూ విదేశీయుల రద్దీ ఉంటుంది. విదేశీయులు భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి ప్రభావితమవుతూ.. సెలబ్రెటీలు సైతం హిందూ మతాన్ని స్వీకరించడం ప్రారంభించారు. హిందూమతాన్ని స్వీకరించి నిత్యం పూజల్లో నిమగ్నమై ఉన్న ఇలాంటి విదేశీయులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో అలాంటి వీడియోలను కూడా చూడవచ్చు, అందులో విదేశీయులు కూడా భజన-కీర్తనలు చేస్తూ కనిపిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక విదేశీయుడు తన అందమైన స్వరంతో శ్లోకాలు పాడుతూ కనిపించాడు.

సాధారణంగా.. విదేశీయులు హిందీ బాషాను మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు.. అయితే ఈ వీడియోలోని ఓ వ్యక్తి హిందీలో అద్భుతంగా  భజన పాడుతున్నాడు. హార్మోనియం వాయిస్తూ ‘హరే రామ-హరే కృష్ణ’ కీర్తనను శ్రావ్యంగా పడుతున్న ఓ వ్యక్తిని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ శ్లోకాన్ని భారతదేశంలోనే కాదు.. విదేశాలలో కూడా చాలా మంది ఇష్టపడటం ప్రారంభించారు. ఆ వ్యక్తి వెనుక కొంతమంది విదేశీ స్త్రీలు నృత్యం చేస్తూ కనిపిస్తున్నారు. రామ నామ స్మరణలో విదేశీయులు మునిగిపోయారు. విదేశీ వ్యక్తి నోట వినిపిస్తున్న ఈ కృష్ణ భజనలను నెటిజన్లు ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Knowledge_of_bhagavad_gita పేరుతో షేర్ చేయబడింది.  ఇది ఇప్పటివరకు 6 లక్షల 86 వేలకు పైగా వ్యూస్ ను, లక్షకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ భక్తుడు ఎవరికైనా తెలుసా..  ఎందుకంటే నేను అతని పాడుతున్న అనేక భజనలను విన్నాను. అవి చాలా హృదయాన్ని హత్తుకునేవిగా ఉన్నాయని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..