Viral Video: తనను అమ్మిన యజమానిని కౌగిలించుకుని మనిషిలా ఏడ్చిన మేక.. వీడియో వైరల్

Surya Kala

Surya Kala |

Updated on: Jul 13, 2022 | 12:46 PM

ఓ మేకను అమ్మడానికి యజమాని మార్కెట్ కు తీసుకుని వచ్చాడు. అనంతరం మేకను అమ్మి.. డబ్బులు తీసుకున్నాడు. ఇలా ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ మేక ఏడుస్తోంది.

Viral Video: తనను అమ్మిన యజమానిని కౌగిలించుకుని మనిషిలా ఏడ్చిన మేక.. వీడియో వైరల్
Goat Viral Video

Viral Video: మనుషులకు, కొన్ని జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. కుక్క, పిల్లి వంటి వాటిని సరదాకోసం పెంచుకుంటే.. ఆవు, మేక, గుర్రం వంటి జంతువులను తమ ఉపాధి కోసం పెంచుకుంటారు. అయితే జంతువులు కూడా భావాలు, భావోద్వేగాలను కలిగి ఉంటాయి. మాట్లాడలేనప్పటికీ తమను పెంచిన యజమానిని అమితంగా ప్రేమిస్థాయి. అంతేకాదు యజమాని నుండి వీడి వెళ్లిపోయే సమయంలో కొన్ని జంతువులు కన్నీరు పెట్టుకుంటాయి. మనుషుల వలె ఏడుస్తాయి కూడా. బక్రీద్ సందర్భంగా తనను అమ్మడానికి మార్కెట్ కు తెచ్చిన యజమానిని హత్తుకుని మనిషిలా మనిషిలా ఏడ్వడం ప్రారంభించింది ఓ మేక. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం జరిగిన బక్రీద్ వేడుకలతో భాగంగా షేర్ చేసిన వీడియోల్లో ఒకటి ఓ మేక ఏడుపు వీడియో వైరల్‌ మారింది. బక్రీద్ సందర్భంగా అమ్మేందుకు ఓ మేక ను మార్కెట్ లోకి తీసుకువచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ మేకను అమ్మడానికి యజమాని మార్కెట్ కు తీసుకుని వచ్చాడు. అనంతరం మేకను అమ్మి.. డబ్బులు తీసుకున్నాడు. ఇలా ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ మేక ఏడుస్తోంది. అంతేకాదు యజమాని భుజంపై తల పెట్టి.. కన్నీరు పెట్టింది. అక్కడున్న వాళ్లందరికీ మేక ఏడుపు వినిపించింది. మేక యజమానిని హత్తుకుని కన్నీరు పెట్టుకున్న సన్నివేశం అక్కడ ఉన్నవారి హృదయాన్ని తాకింది. అందరూ  కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మేక యజమాని కూడా దానిని కౌగిలించుకున్నాడు. ఈ భావోద్వేగ సంఘటన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మేక ప్రేమకు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu