Viral Video: దేశీ భాషలో టీ అమ్ముతున్న విదేశీ వనిత.. గరం గరం ఛాయ్ అంటూ స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్న..

టీని భారతీయులు మాత్రమే తాగడానికే ఇష్టపడతామని మీరు అనుకుంటే.. అది పూర్తిగా తప్పు. మన భారతీయులలాగే విదేశీయులు కూడా తేనీరుని అత్యంత ఇష్టంగా తాగుతారు. ఓ విదేశీ మహిళ హిందీలో చక్కగా మాట్లాడుతూ టీ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video: దేశీ భాషలో టీ అమ్ముతున్న విదేశీ వనిత.. గరం గరం ఛాయ్ అంటూ స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్న..
Foreigner Selling Chai
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2022 | 10:54 AM

Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా టీ ప్రియులు కనిపిస్తూనే ఉంటారు. వాస్తవానికి అన్ని వయసుల వారు ఇష్టపడి తాగే పానీయం టీ. ఇక భారతీయులు పొద్దున్నే ఒక కప్పు టీ తాగి ఉత్సాహంగా ఫీల్ అవుతారు. టీ తాగి ఆ రోజంతా తగిన శక్తి లభించిట్లు భావిస్తారు. మనదేశంలో రోడ్డు ప్రక్కన టి స్టాల్ నుంచి.. ఖరీదైన రెస్టారెంట్స్ లో కూడా రకరకాల టీలు దొరుకుంటాయి. భారీగా వ్యాపారం జరుగుతుంది కూడా.. అయితే ప్రస్తుతం ఓ విదేశీ మహిళ టీ అమ్ముతున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో స్పెషల్ ఏమిటంటే.. ఆ విదేశీ వనిత పూర్తిగా దేశీ స్టైల్‌లో టీ అమ్ముతూ కనిపిస్తుంది. ఆ వనిత భాష వింటే షాక్ తింటారు.

భారతీయులకు టీని అలవాటు చేసింది బ్రిటిష్ వారైనా.. ఆ ‘టి’ కి సరికొత్త రూపం తెచ్చి.. రకరకాల టీలను తయారు చేసింది మాత్రం  భారతీయులే. అయితే టీని భారతీయులు మాత్రమే తాగడానికే ఇష్టపడతామని మీరు అనుకుంటే.. అది పూర్తిగా తప్పు. మన భారతీయులలాగే విదేశీయులు కూడా తేనీరుని అత్యంత ఇష్టంగా తాగుతారు. ఓ విదేశీ మహిళ హిందీలో చక్కగా మాట్లాడుతూ టీ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Desiismybae (@desiismybae)

వైరల్ అవుతున్న వీడియోలో..  ఒక మహిళ తనతో పాటు టీ గ్లాసులున్న స్టాండ్ పట్టుకుని గదిలోపలికి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఆమె లోపలికి వస్తూనే గదిలో కూర్చున్న వారితో “చాయ్, చాయ్ గరం చాయ్ అంటూ ఎనౌన్స్ చేసింది. ఆ మహిళ ఉద్దేశ్యం.. బహుశా వేడి టీ.. నేను మీ కోసం ప్రత్యేకంగా వేడి టీ తయారు చేసాను..  మీ కోసం స్పెషల్ హాట్ టీ తయారు చేశాను.. తీసుకుంటారా అని హిందీలో అడుగుతుంది. ” స్త్రీ హిందీ మాట్లాడుతున్న తీరు. ఆమెను చూస్తుంటే ఆ మహిళ ఓ హిందీ ప్రొఫెసర్ దగ్గర కోచింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో desiismybae అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే నాలుగు లక్షల వ్యూస్ ని, 42 వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.   ఈ క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.  ఒక విదేశీ మహిళ .. హిందీలో మాట్లాడడం నిజంగా గొప్ప విషయం అని కామెంట్ చేశారు.   ఆ మహిళ నా కుటుంబం సభ్యులు,  నా కంటే కూడా బాగా హిందీ మాట్లాడుతోంది అని మరొక వినియోగదారు రాశారు. ‘మా హిందీ టీచర్ ఆ మహిళ దగ్గరకు ఎలా చేరుకున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..