viral video: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ ఛాంపియన్ స్టార్, ‘ది గ్రేట్ ఖలీ’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ టోల్ బూత్ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. టోల్ ప్లాజా ఉద్యోగులతో ఖలీ గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐడీ కార్డు అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని ఖలీ చెప్పుతో కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఖలీ మాత్రం.. టోల్‌ఫ్లాజా ఉద్యోగులు తనను బ్లాక్ మెయిల్ చేశారని చెబుతున్నాడు. జలంధర్ నుంచి కర్నాల్‌కు ఖలీ వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫిలౌర్‌లోని టోల్ ప్లాజాగా తెలిసింది. అయితే అందులో ఖలీ దాడి చేసిన విజువల్ మాత్రం కనిపించలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హర్యానాలోని కర్నాల్‌కు ఖలీ వెళ్తుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లో గల జలంధర్ నుంచి ఖలీ.. హర్యానాలో గల కర్నాల్ వెళుతున్నారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. అయితే మీ ఐడీ కార్డు అడిగితే తన కొలిగ్‌ను కొట్టారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపిస్తున్నారు. కానీ అతను బ్లాక్ మెయిల్ చేశాడని ఖలీ చెబుతున్నాడు. అంతేకాదు తనను జాతి వివక్ష ఆరోపణలు చేశాడని చెబుతున్నారు.
“Yesterday, toll tax employee of Punjab’s Phillaur stopped my car & misbehaved for selfie. When I denied selfie, they ruthlessly passed racist comments, also used bad words,” says Wrestler The Great Khali on viral video in which he allegedly misbehaved with a toll employee pic.twitter.com/GqYIhloBak