Viral: మరికొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఫోన్‌కు అనుమానాస్పద మెయిల్.. వధువుకు మైండ్ బ్లాంక్!

మరికొద్ది గంటల్లో పెళ్లి. అంతలోనే పెళ్లికూతురు ఫోన్‌కు ఓ అనుమానాస్పద మెయిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన ఆమెకు...

Viral: మరికొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఫోన్‌కు అనుమానాస్పద మెయిల్.. వధువుకు మైండ్ బ్లాంక్!
Marriage 1Image Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2022 | 12:06 PM

మరికొద్ది గంటల్లో పెళ్లి. అంతలోనే పెళ్లికూతురు ఫోన్‌కు ఓ అనుమానాస్పద మెయిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన ఆమెకు గట్టి షాక్‌ తగిలింది. చివరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఇంతకీ అసలు ఆ మెయిల్‌లో ఏముంది.? ఎవరు పంపారు.? ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన అమూల్ గావ్లీ అనే యువకుడికి 2015లో మౌనిక(పేరు మార్చాం) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆ యువకుడు.. మౌనికతో శారీరికంగా దగ్గరయ్యాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం సాగించారు. ఏడేళ్లుగా ఈ లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగుతోంది. అయితే సదరు యువకుడు.. మౌనికకు తెలియకుండా ఈ ఏడాది జూన్‌లో స్వగ్రామానికి చేరుకొని.. చంద్రాపూర్‌కు చెందిన సంధ్య(పేరు మార్చాం) అనే యువతిని నిశ్చితార్ధం చేసుకున్నాడు. మౌనికను పూర్తిగా దూరం పెట్టాడు.

తన ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు అమూల్‌ దగ్గర నుంచి ఎలాంటి రిప్లయ్ రాకపోవడంతో మౌనికకు అనుమానం వచ్చింది. ఎంక్వయిరీ చేయగా.. అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయానికి పోలీసులను ఆశ్రయిస్తుంది మౌనిక. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాని అమూల్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. మరోవైపు అమూల్ ‌ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో తన జీవితం నాశనం అయినట్లు.. మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనుకున్న మౌనిక సోషల్ మీడియా ద్వారా కాబోయే పెళ్లికూతురికి ఎఫ్‌ఐఆర్ కాపీని పంపించింది. దాన్ని చూసిన వధువు.. ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించగా.. వారు ఇండోర్ పోలీసులను అడిగి తెలుసుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీనితో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ అయింది.

ఇవి కూడా చదవండి

Marriage

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!