Viral Photo: మీ ఐ పవర్ రేంజ్ ఏంటో తెలుస్తది.. ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.!

కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ రకరకాల పోస్టులను క్రియేట్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. వాటిల్లో ఫోటో పజిల్స్ ఒకటి..

Viral Photo: మీ ఐ పవర్ రేంజ్ ఏంటో తెలుస్తది.. ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 12, 2022 | 5:06 PM

ప్రస్తుతం ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ రకరకాల పోస్టులను క్రియేట్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మీమ్స్, ఫన్నీ ట్రోల్స్ వైరల్‌గా మారాయి. అలాగే వీటితో పాటు కాస్త మెదడుకు కూడా పని చెప్పాలంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సరైన ఆప్షన్. ఆ ఫోటోలో ఇంకొన్ని చిత్రాలు దాచిపెట్టడమే కాదు.. అందులో ఉన్న పజిల్ కనిపెట్టండి అంటూ.. నెటిజన్లకు పలువురు సవాల్ విసురుతున్నారు. మేధావులు సైతం వాటిని సాల్వ్ చేయలేక పప్పులో కాలేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మీ కంటి చూపు పవర్‌కీ పరీక్ష పట్టే ఆ ఫోటోలో ఓ ఉడుత దాగుంది. దాన్ని కనిపెట్టాలి. అది ఆషామాషీగా మీకు దొరకదందోయ్.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. చిటికెలో గుర్తిస్తారు. మరి ఎంత వెతికినా దొరకట్లేదా.? ఇంకెందుకు లేట్ సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..