Google Search: గూగుల్‌లో అబ్బాయిలు ఏం వెతుకుతున్నారో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాంకే!
ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరూ గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని..
ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరూ గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని సులభంగా పొందుతాం. ఈ మధ్యకాలంలో యువత గూగుల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసలు గూగుల్‌లో అబ్బాయిలు ఏం వెతుకుతున్నారో మీకేమైనా తెలుసా.? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ప్రతీ సంవత్సరం సుమారు 68 వేల మంది పురుషులు తమ లైంగిక సామర్ధ్యం గురించి పలు విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌ను శోధిస్తారట. అంతేకాకుండా షేవ్ చేయడం వల్ల గడ్డం వెంట్రుకలు పెరుగుతాయా.? లేదా.?. గడ్డం మందంగా ఉండాలంటే ఏం చేయాలి.? టోపీ ధరించడం వల్ల జుట్టు ఊడుతుందా.? బాడీ ఫిట్‌గా ఉండాలంటే ఎలాంటి వర్కౌట్స్ చేయాలి.? ప్రోటీన్ షేక్స్ ఏం తాగాలి.? అనే విషయాలు గూగుల్‌ను అడిగి తెలుసుకుంటారట.
అంతేకాదు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా.? అమ్మాయిలను సంతోషపరిచే అంశాలు ఏంటి? వారు ఇష్టపడేవి.? ఇష్టపడనివి.? ఏంటి.? అనే అంశాలు శోధిస్తారట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అబ్బాయిలు గూగుల్‌లో రొమ్ము క్యాన్సర్ గురించి కూడా సెర్చ్ చేస్తారట. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం. అయితే అబ్బాయిలు ఆ వ్యాధి తమకు వస్తుందా.? లేదా అనే విషయాన్ని అబ్బాయిలు తెలుసుకుంటారు.