Viral: ఫస్ట్ నైట్ రోజున ముఖం చాటేసిన భర్త.. ఆరా తీయగా దెబ్బకు భార్య దిమ్మతిరిగే షాక్!
ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు, రహస్యాలు, అబద్దాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే.. అవి దంపతుల మధ్య చిచ్చు పెట్టడం ఖాయం.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్ళతో ఒకటైన దంపతులు.. నూరేళ్ళు కలిసి మెలిసి జీవించాలంటే.. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు, రహస్యాలు, అబద్దాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే.. అవి దంపతుల మధ్య చిచ్చు పెట్టడం ఖాయం. ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ కూడా అలాంటిదే. అత్తింటివారు దాచిపెట్టిన ఓ నిజం.. ఈ యువతి కాపురంలో చిచ్చు పెట్టింది. ఎనిమిది నెలలుగా వేధింపులు భరించిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పానిపట్ జిల్లా సమల్కా పట్టణానికి చెందిన యువతికి గతేడాది అక్టోబర్‌లో గుర్‌గ్రామ్‌కు చెందిన యువకుడితో వివాహమైంది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి.. ఫస్ట్ నైట్‌లో షాకింగ్ విషయం తెలిసింది. మొదటి రాత్రి రోజున భర్త ముఖం చాటేయడంతో ఆరా తీసిన సదరు యువతికి.. తన భర్త శారీరక, మానసిక వ్యాధిగ్రస్తుడని తెలుస్తోంది. అతని ప్రైవేటు పార్ట్‌కు ఆపరేషన్ జరిగినట్లు.. లైంగికంగా అన్‌ఫిట్ అని తెలుస్తుంది. ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి.. తనను మోసం చేసినందుకు గానూ అత్తమామలను ఆ యువతి నిలదీసింది. అంతే.! అప్పటి నుంచి ఆమె వేధింపులు మొదలయ్యాయి. ఎనిమిది నెలల పాటు వేధింపులు భరిస్తూ వచ్చిన ఆ యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.