AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కారును అడ్డుకుని దోచుకోవాలనుకున్నారు.. సీన్ కట్ చేస్తే.. అందులో వ్యక్తులను చూసి ఖంగుతిన్నారు!

ఈద్ పార్టీ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి అదిరిపోయే ప్లాన్ రచించారు.

Viral: కారును అడ్డుకుని దోచుకోవాలనుకున్నారు.. సీన్ కట్ చేస్తే.. అందులో వ్యక్తులను చూసి ఖంగుతిన్నారు!
Lift
Ravi Kiran
|

Updated on: Jul 12, 2022 | 6:12 PM

Share

ఈద్ పార్టీ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి అదిరిపోయే ప్లాన్ రచించారు. అయితే ఎంత తెలివైన దొంగ అయినా కూడా తప్పు చేయడం సహజమే. వీరి విషయంలోనూ అదే జరిగింది. దోపిడీ చేసేందుకు ఆపిన వాహనం క్రైమ్ బ్రాంచ్ పోలీసులది కావడంతో.. చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు జైలుపాలయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పల్వాల్‌ జిల్లా చందత్‌ గ్రామానికి చెందిన కృష్ణ అలియాస్ రాహుల్, రాహుల్ అలియాస్ రాజా ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు ఈద్‌కు పార్టీ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో దారి దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. ”లిఫ్ట్ కోసం వేచి చూసి.. ఓ వాహనాన్ని ఆపి.. అందులోకి ఎక్కగానే బెదిరించి డబ్బులు లాక్కోవాలని ప్లాన్ వేశారు.”

అనుకున్నట్లుగానే స్థానిక రహదారిపై కాపు కాశారు. దూరం నుంచి ఓ వాహనం వస్తున్నట్లుగా గమనించారు. దగ్గరకు రాగానే దాన్ని ఆపి.. లిఫ్ట్ కావాలంటూ అడిగారు. అయితే ఇక్కడే వారికి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఎదురైంది. ఆ వాహనంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు. వీరి కదలికలు అనుమానంగా కనిపించడంతో.. ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు నిందితులిద్దరిపై దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Follow Us
సింహరాశిలోకి బుధుడు.. ఈ 6 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!..
సింహరాశిలోకి బుధుడు.. ఈ 6 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!..
గచ్చిబౌలి బిల్డింగ్‌ ప్రమాదంపై హైడ్రా కమిషనర్‌ సంచలన వ్యాఖ్యలు
గచ్చిబౌలి బిల్డింగ్‌ ప్రమాదంపై హైడ్రా కమిషనర్‌ సంచలన వ్యాఖ్యలు
10 నిమిషాల్లో చేసుకునే కమ్మనైన నేపాలీ ఎగ్ కర్రీ..
10 నిమిషాల్లో చేసుకునే కమ్మనైన నేపాలీ ఎగ్ కర్రీ..
ఇంటికి కేవలం పడుకోవడానికే వస్తున్నా..నెలకు రూ. 35వేల జీతంతో నరకం!
ఇంటికి కేవలం పడుకోవడానికే వస్తున్నా..నెలకు రూ. 35వేల జీతంతో నరకం!
ఎన్నికల వేళ హై అలర్ట్.. టాప్ లీడర్లకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!
ఎన్నికల వేళ హై అలర్ట్.. టాప్ లీడర్లకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!
కలలో శివుడు కనిపించారా? శివలింగం, పాము, శివాలయం కనిపిస్తే ఇదే..
కలలో శివుడు కనిపించారా? శివలింగం, పాము, శివాలయం కనిపిస్తే ఇదే..
మనీ ప్లాంట్ గడ్డిలా గుబురుగా పెరగాలంటే ఇది ఒక్క చెంచా వేయండి..
మనీ ప్లాంట్ గడ్డిలా గుబురుగా పెరగాలంటే ఇది ఒక్క చెంచా వేయండి..
ఒక్క కి.మీ ప్రయాణానికి రైలుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి?
ఒక్క కి.మీ ప్రయాణానికి రైలుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి?
50 గజాల స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టాలి? రూల్స్ ఇవే..
50 గజాల స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టాలి? రూల్స్ ఇవే..
సరిహద్దు అవతలున్నా వదిలేది లేదు.. హఫీజ్ సయీద్‌పై భారత్ సరికొత్త..
సరిహద్దు అవతలున్నా వదిలేది లేదు.. హఫీజ్ సయీద్‌పై భారత్ సరికొత్త..