Viral Video: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధురాలి కోసం కారు దిగి కదిలొచ్చిన యువకుడు..

హృదయానికి హత్తుకునే దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఆ సీన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లను ఆలోచింప జేస్తోంది.

Viral Video: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధురాలి కోసం కారు దిగి కదిలొచ్చిన యువకుడు..
The Kind Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2022 | 10:57 AM

మనుషుల్లో మానవత్వం నశించిపోతున్న రోజులివి.. సాయం చేసే చేతులు ఈ రోజుల్లో కరువు అయ్యాయనే సంఘటనలు అనేకం తరచూ సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. ఎదుటివారికి సాయం చేయాలనే మనసున్న మనుషుల కోసం అక్కడక్కడా వేతుక్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో స్వార్థం తప్పా.. పక్కవాళ్ల గురించి ఆలోచించే వారు తక్కువగానే కనిపిస్తారు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి ఆశాజనక దృశ్యాలు ఈ భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం మిగిలే ఉందని నమ్మేలా చేస్తాయి. అలాంటిదే హృదయానికి హత్తుకునే దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఆ సీన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లను ఆలోచింప జేస్తోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వృద్ధురాలిని రోడ్డు దాటించేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. అది ట్రాఫిక్‌తో రద్దీగా ఉన్న హైవేలా కనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో ఆగివున్న ఓ వ్యక్తి రోడ్డు దాటలేక అవస్థ పడుతున్న వృద్ధురాలిని చూశాడు.. దాంతో అతడు ఆమెకు సాయం చేయాలని భావించాడు. అతడు తన కారులోంచి దిగి ముందుకు వచ్చాడు..ఆ పెద్దావిడను జాగ్రత్తగా పట్టుకుని నెమ్మదిగా రోడ్డు దాటిస్తున్నాడు. ఆ దృశ్యాలు వీడియోలో మనం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇదంతా రిలే అనే మహిళ కెమెరాలో బంధించింది. అనంతరం ఆమె ఈ వీడియోని రిలే సవన్నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ద్వారా ఫుటేజ్ మళ్లీ షేర్ చేయబడింది. దీంతో వీడియో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. మానవత్వం ఇంకా మనుగడలో ఉందనడానికి ఈ దృశ్యాలు నిదర్శనమంటూ పలువురు నెటిజన్లు కొనియాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..