Optical Illusion: కళాకారుడి సృష్టి ఈ అమ్మాయి బొమ్మ.. మీ ఏకాగ్రతకు, మేధస్సుకు పరీక్ష.. నలుగురు యువతులను కనుక్కోండి చూద్దాం

ఓ  ఆప్టికల్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఉన్న మరో నలుగురు మహిళలు వెతకాలంటూ సవాల్ విసిరారు.. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు శాతం మంది మాత్రమే నలుగురు అమ్మాయిలను  కనుగొనగలిగారు. 

Optical Illusion: కళాకారుడి సృష్టి ఈ అమ్మాయి బొమ్మ.. మీ ఏకాగ్రతకు, మేధస్సుకు పరీక్ష.. నలుగురు యువతులను కనుక్కోండి చూద్దాం
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2022 | 8:53 AM

Optical Illusion: గత కొన్ని ఏళ్ల క్రితం పత్రికలు, వార పత్రికలు హవా కొనసాగినప్పుడు.. మీ కళ్ళకు పరీక్ష.. ఈ చిత్రంలో ఉన్న చిత్ర విచిత్రాలను కనిపెట్టండి మెడకు పదును అంటూ రకరకాల ఆర్టికల్స్ ఉండేవి. కాలక్రమంలో ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. దీంతో ఇప్పుడు ఒక ఆప్టికల్ చిత్రం సోషల్ మీడియాలో షేర్ అవుతూ.. దీనిలోని ఉన్న విశేషాలు కనుక్కోండి అంటూ సవాల్ విసురుతున్నాయి. ప్రజలు తమ మనస్సును ఆ చిత్రంపై లగ్నం చేసి.. సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడతారు. ఈ రకమైన చర్య మనస్సును చాలా ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఆప్టికల్ ఇల్యూషన్ మన వ్యక్తిత్వానికి కూడా ఓ పరీక్షవంటిది. తాజాగా ఓ  ఆప్టికల్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఉన్న మరో నలుగురు మహిళలు వెతకాలంటూ సవాల్ విసిరారు.. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు శాతం మంది మాత్రమే నలుగురు అమ్మాయిలను  కనుగొనగలిగారు.

వైరల్ అవుతున్న చిత్రం ఉక్రేనియన్ కళాకారుడు ఒలేగ్ షుప్లియాక్ రూపొందించిన స్కెచ్ .  దీనిని పరిష్కరించడంలో 98 శాతం మంది ప్రజలు  విఫలమయ్యారని పేర్కొన్నారు. స్కెచ్‌లో స్త్రీ ముఖం తేలికగా కనిపిస్తుంది..  అయితే మిగిలిన మూడు ముఖాలను కనుగొనడంలోనే ప్రజలు మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్  చిత్రంలో చాలా మంది ..  నాలుగు ముఖాలను కనుగొనలేకపోయారు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని ఒలేగ్ తన వెబ్‌సైట్‌లో పంచుకున్నారు. తాను ఈ చిత్రాన్ని ఆప్టికల్ భ్రమలో సింబాలిక్ మార్గంలో రూపొందించినట్లు రాశాడు.

చిత్రంలో, ప్రథమ మహిళ ఫోన్‌లో హాయిగా మాట్లాడుతున్నట్లు సులభంగా కనిపిస్తుంది.. రెండవ మహిళను కనుగొనడానికి, మీరు మీ కళ్ళను మరికొంచెం కేంద్రీకరించాల్సి ఉంటుంది. మీరు మొదటి మహిళ ముఖంలోని బుగ్గలు, చేతులసహా ముఖంపై దృష్టి పెట్టాలి. అపుడు రెండో యువతి మీకు కనిపిస్తుంది. మూడవ స్త్రీ కోసం, మీరు స్త్రీ  చేతిని చూడవలసి ఉంటుంది, అక్కడ మీకు స్త్రీ ముఖం కనిపిస్తుంది. దీని తరువాత, చివరకు నాల్గవ మహిళ ముఖాన్ని చూడాలంటే..  స్త్రీ కడుపుని చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, ఈ చిత్రం ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో నలుగురు ముఖాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు అనేక సార్లు చిత్రాన్ని చూసిన తర్వాత కూడా యువతులను కనుగొనలేకపోయారు. మీరు ఈ చిత్రంలో ఉన్న మహిళల ముఖాలను గుర్తించగలిగితే, మీరు నిజంగా మేధావి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..