Identical Twins: అసాధారణ కవలలకు జన్మనిచ్చిన మహిళ.. మూడు రోజుల తేడాతో పుట్టిన చిన్నారులు

Identical Twins: ఓ మహిళల కవల పిల్లలకు మూడు రోజుల తేడాతో జన్మనిచ్చింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మూడో రోజు.. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు మూడు రోజుల తేడాతో పుట్టిన ఈ కవల సిస్టర్స్.. ఒకేలా ఉండడం విశేషం.

Identical Twins: అసాధారణ కవలలకు జన్మనిచ్చిన మహిళ.. మూడు రోజుల తేడాతో పుట్టిన చిన్నారులు
Identical Twins Born 3 Days
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2022 | 7:08 PM

Identical Twins: కవలపిల్లలు సర్వసాధారణంగా కొన్ని నిమిషాల తేడాతోనో.. లేక పోతే గంట తేడాతోనో పుడతారు.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఓ మహిళల కవల పిల్లలకు మూడు రోజుల తేడాతో జన్మనిచ్చింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మూడో రోజు.. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు మూడు రోజుల తేడాతో పుట్టిన ఈ కవల సిస్టర్స్.. ఒకేలా ఉండడం విశేషం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అరుదైన విచిత్రమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్‌ మార్టినెక్స్‌ అనే మహిళకు ఇటీవల ప్రసవం కోసం టెక్సాస్‌లోని అబిలీన్‌లోని హెండ్రిక్ హెల్త్ ఫెసిలిటీ సెంటర్ లో చేరింది. మార్చి 7న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో రెండో బిడ్డ ఉన్నట్లు.. వైద్యుల స్కానింగ్ లో తెలుసుకున్నారు. ఈ క్రమంలో కార్మెన్‌ మార్టినెక్స్‌ వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని.. మూడు రోజుల అనంతరం.. మార్చి 10న రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరూ ఆడపిల్లలు ఒకేలా బంగారు బొమ్మల్లా ఉన్నారు. కానీ కొంచెం బరువు తక్కువగా ఉండడంతో.. వైద్యులు వారిని ఐసియులో ఉంచి చికిత్సనందిస్తున్నారు. కార్మెన్ , జానీ హెర్నాండెజ్ దంపతులు మొదటి పాపకు గాబ్రియెల్లా (గాబీ) గ్రేస్ హెర్నాండెజ్‌ అని, రెండో పాపకు ఇసాబెల్లా రోజ్ హెర్నాండెజ్‌ను అని పేర్లు పెట్టారు.

Us Woman

Us Woman

శిశువులను ప్రసవంలో సహాయం చేసిన డాక్టర్ జేమ్స్ ఎల్ టాడ్విక్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇలాంటి డెలివరీ మొదటిసారి చూశానని.. ఇది చాలా అసాధారణం అని చెప్పారు. ఇద్దరు పిల్లలలు ఆరోగ్యంగా బరువు పెరిగేంతవరకూ ఆస్పత్రిలో చికిత్సలో ఉంచి చికిత్సనందించి డిశ్చార్జ్ చేసినట్లు ఇప్పుడు ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..