Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strangest Laws: నవ్వకుంటే జైలు..స్నానం చెయ్యకుండా నిద్రపోయారో అరెస్టు.. ఈ దేశాల్లో వింత చట్టాలు!

ఈ మధ్యకాలంలో గుజరాత్‌కు చెందిన ఓ యువతి సోలోగమీ అంటూ కొత్త ఆచారాన్ని లేవనెత్తింది. దీనిని విన్న కొంత మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంటే.. మరికొందరేమో ఎదెక్కడి పోయేకాలం అంటూ నానామాటలు అంటున్నారు. ఇదే మాదిరిగా ప్రపంచ దేశాల్లో వివిధ వర్ణాలు, కులాలు, మతాలు ఉన్నట్లే వింత వింత చట్టాలు కూడా అమల్లో..

Strangest Laws: నవ్వకుంటే జైలు..స్నానం చెయ్యకుండా నిద్రపోయారో అరెస్టు.. ఈ దేశాల్లో వింత చట్టాలు!
Bathing
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2022 | 8:46 PM

World’s Strangest Laws: ఈ మధ్యకాలంలో గుజరాత్‌కు చెందిన ఓ యువతి సోలోగమీ అంటూ కొత్త ఆచారాన్ని లేవనెత్తింది. దీనిని విన్న కొంత మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంటే.. మరికొందరేమో ఎదెక్కడి పోయేకాలం అంటూ నానామాటలు అంటున్నారు. అసలు ఈ విధమైన వివాహానికి భారతీచ చట్టం ప్రకారం గుర్తింపు కూడా ఉండదు. ఇదే మాదిరిగా ప్రపంచ దేశాల్లో వివిధ వర్ణాలు, కులాలు, మతాలు ఉన్నట్లే వింత వింత చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. ఆయా చట్టాలను ఉల్లంగించిన వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షిస్తాయట. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోచే చట్టాలు మాత్రం మీరెప్పుడూ కనీ వినీ ఎరుగనివి. వింటే చాలు పడిపడి నవ్వుకుంటారు.

వింత చట్టాలు – అమలు చేస్తున్న దేశాలు

ఇవి కూడా చదవండి
  • ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ వింత చట్టం అమల్లో ఉంది. అక్కడ ఎవరైనా స్నానం చేయకుండా నిద్రపోతే చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా స్నానం చెయ్యకుండా నిద్రపోయినందుకు జైలు శిక్ష కూడా విధిస్తారు.
  • లోదుస్తులతో ఎవరైనా కారును శుభ్రం చేస్తే అందుకు గానూ జరిమానా విధిస్తుంది అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో.
  • స్విట్జర్లాండ్‌లో ఎవరైనా రాత్రి 10 గంటల తర్వాత బాత్‌రూంలో ఫ్లష్ చేసినా లేదా బాత్ రూం నుంచి ఏ విధమైనం శబ్దం వచ్చినా జరిమానా విధిస్తారట.
Itali

Itali

  • ఇటలీలోని మిలాన్‌లో బహిరంగంగా సంచరించే ప్రతి పౌరుడూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి. ఎవరి ముఖంమీదనైనా నవ్వు మాయం అయ్యిందో.. దానిని వెంటనే తీవ్ర నేరంగా పరిగణించి వంద డాలర్లవరకు జరిమానా విధిస్తారు. దీంతో ఒక్క రోజుకు వందల మంది ఈ జరిమానాల బారీన పడుతున్నారట. ఐతే ఆసుపత్రి, అంత్యక్రియలకు వెళ్లే సమయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది.
  • హాంకాంగ్‌లో భర్త తన భార్యను మోసం చేస్తే.. భార్య చేతులతో భర్తను చంపడం అక్కడ చట్టబద్ధంగా పరిగణించబడుతుంది. ఐతే తన చేతులతో భర్తను చంపడం ఇష్టపడక పోతే ఇతర మార్గాల్లో శిక్షను అమలు చేసే వెసులుబాటు కూడా ఉందట.
  • సింగపూర్‌లో 1992 జనవరి 3 నుంచి చూయింగ్‌ గమ్‌లను అమ్మడం, తయారు చేయడం నేరం. ఐతే నోటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డాక్టర్‌ సలహామేరకు చూయింగ్‌ గమ్‌ నమలవచ్చని 2004లో అక్కడి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
Germani

Germani

  • సాధారణంగా ఏ దేశ ప్రభుత్వమైనా రోడ్లపై స్పీడ్‌గా డ్రైవ్‌ చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంది. జర్మనీలోని ఆటోబాన్‌ రోడ్ల మీద మాత్రం కోరుకున్నంత స్పీడ్‌గా డ్రైవ్‌ చేయవచ్చు. ఐతే కారులో సరిపడినంతగా ఆయిల్‌ ఉండాలి. ఒకవేళ రోడ్డుపై హఠాత్తాగా కారు ఆగిపోతే వెంటనే జరిమానా కట్టవల్సి ఉంటుంది.
  • జపాన్‌లో ఉబకాయం క్షమించరాని నేరం. 2008లో మెటాబో లాను జపాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. పావురాలకు ఆహారం ఇస్తే శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీలలో నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా పావురాళ్లకు గింజలు వేస్తూ కనిపిస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తారక్కడ.