Telangana: జులై – ఆగస్టు నెలల్లో ఎంట్రన్స్‌ టెస్టులతో యమ బిజీ! ఏయే తేదీల్లో ఏయే పరీక్షలున్నాయంటే..

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 3,61,375 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఎంసెట్‌కు..

Telangana: జులై - ఆగస్టు నెలల్లో ఎంట్రన్స్‌ టెస్టులతో యమ బిజీ! ఏయే తేదీల్లో ఏయే పరీక్షలున్నాయంటే..
Ts Cets
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2022 | 5:04 PM

TSCETs exam schedule 2022 released: తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 3,61,375 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఎంసెట్‌కు 2,61,616 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఎంసెట్‌తోపాటు, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌ తదితర ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడినికి గడువు ఇంకా ఉంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు చేరాయి. గడువు ముగిసే నాటికి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తు గడువులు.. మీకోసం!

సెట్ల వారీగా ప్రవేవ పరీక్షల (TS CET) తేదీలివే..

  • తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష జూలై 14, 15, 18, 20 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 2,61,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రూ.500ల ఆలస్య రుసుముతో జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) జూలై 13న నిర్వహింబడుతుంది. రూ.500ల ఆలస్య రుసుముతో జూన్ 14న వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పరీక్షకు మొత్తం 22,549 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
  • తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) పరీక్ష జూలై 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటివరకు 30,941 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) పరీక్ష జూలై 29 నుంచి ఆగస్టు 8 మధ్య నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు 4,462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుము లేకుండా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకున్నారు.
  • తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) జూలై 27న, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGLCET) ఆగస్టు 8న జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 24,242 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుము లేకుండా జూన్ 16 దరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS Ed. CET) జూలై 26, 27 తేదీల్లో నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు మొత్తం 16,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PECET) ఆగస్ట్ 22న జరుగుతుంది. ఆలస్య రుసుము లేకుండా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 1,128 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

మరిన్ని పూర్త సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ tsche.ac.in.లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.