AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PCI Recruitment 2022: నెలకు రూ.లక్షల జీతంతో..ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Pharmacy Council of India).. ఒప్పంద ప్రాతిపదికన అడ్వైజర్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, సీనియర్ అకౌంటెంట్ తదితర (Adviser Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

PCI Recruitment 2022: నెలకు రూ.లక్షల జీతంతో..ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Pci
Srilakshmi C
|

Updated on: Jun 12, 2022 | 5:37 PM

Share

Pharmacy Council of India Technical officer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Pharmacy Council of India).. ఒప్పంద ప్రాతిపదికన అడ్వైజర్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, సీనియర్ అకౌంటెంట్ తదితర (Adviser Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 39

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • అడ్వైజర్‌ (అప్రూవల్ బ్యూరో) పోస్టులు: 2
  • టెక్నికల్ అసిస్టెంట్(పాలసీ బ్యూరో) పోస్టులు: 10
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 5
  • సీనియర్ అకౌంటెంట్ పోస్టులు: 5
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 10
  • సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు: 1
  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు: 1
  • రిసెప్షనిస్ట్ పోస్టులు: 2
  • ఓఎస్‌డీ టు ప్రెసిడెంట్ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా-డి, పీహెచ్‌డీ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకాం, బీసీఏ, బీటెక్‌, ఎంసీఏ, ఎంకాం, సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పోస్టులో పంపించాలి.

అడ్రస్‌: Pharmacy Council of India, NBCC Centre, 3rd Floor, Plot No.2, Community Centre, Maa Anandamai Marg, Okhla Phase I, New Delhi – 110 020.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.