ESIC Recruitment 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో గ్రేడ్‌ II ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మధ్యప్రదేశ్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల (Specialist Grade II Posts) భర్తీకి అర్హులైన..

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో గ్రేడ్‌ II ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..
Esic Hospital
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2022 | 9:41 PM

ESIC Model Hospital Grade-II Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మధ్యప్రదేశ్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల (Specialist Grade II Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 11

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు

విభాగాలు: కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Regional Director, ESI Corporation, Panchdeep Bhawan, Nanda Nagar, Indore, Madhya Pradesh-452011.

దరఖాస్తు రుసుము: రూ. 500

ఇంటర్వ్యూ తేదీ: జులై 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.