AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTUH: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు..

తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూహెచ్‌ (JNTUH) శుభవార్త తెలిపింది. విద్యార్థులు తమ సొంతూళ్లకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకుని, పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ..

JNTUH: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు..
Jntuh
Srilakshmi C
|

Updated on: Jun 11, 2022 | 5:58 PM

Share

Exam centres nearest to hometown of students: తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూహెచ్‌ (JNTUH) శుభవార్త తెలిపింది. విద్యార్థులు తమ సొంతూళ్లకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకుని, పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ జేఎన్టీయూహెచ్‌ ప్రకటన విడుదల చేసింది. అంటే విద్యార్థులే స్వయంగా పరీక్ష కేంద్రాల (Exam Centre)ను ఎంచుకునే అవకాశం కల్పించింది. కాగా కరోనా కల్లోల కాలంలో ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు తమ నివాస ఊళ్లకు దగ్గర్లోని కాలేజీల్లో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.

ఈ మేరకు జూన్‌ 19వ తేదీలోగా విద్యార్థులు క్లస్టర్ల వారీగా మూడు కాలేజీలను ఎంపిక చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. విద్యార్థులు ఎంచుకునే మూడు కాలేజీల్లో ఒకటి కచ్చితంగా జేఎన్‌టీయూ అఫిలియేటెడ్‌ కాలేజ్‌ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు కాలేజీలను సమర్పించకపోతే తాము చదువుకున్న కాలేజీలోనే పరీక్ష కేంద్రం కేటాయించనున్నారు. విద్యార్థులు ఎంచుకున్న మూడు కాలేజీల్లో పరిమితికి మించి ఎంపికలు వస్తే, విద్యార్థి చదువుకుంటున్న కాలేజీలోనే పరీక్ష కేంద్రం కేటాయించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.