JEE Main 2022: మరికొన్ని గంటల్లో విడుదలకానున్న జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్ కార్డులు.. పరీక్ష తేదీలివే..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మరికొన్ని గంటల్లో విడుదలచేయనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు..
JEE Main 2022 Session-1 Admid Card download: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మరికొన్ని గంటల్లో విడుదలచేయనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో అడ్మిట్ కార్డు (Admid Card)లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లను నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందుకోవచ్చు. కాగా జూన్ 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. జేఈఈ మెయిన్ అనంతరం, అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగాఉన్న ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
JEE Main 2022 Session 1 admit cardలను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే JEE Main session 1 2022 admit card లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్ వర్డ్‌లో లాగిన్ అయ్యి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
- వెంటనే అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- సేవ్ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇక ఇప్పటికే జేఈఈ మెయిన్ సెషన్ II రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 1 నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో జూన్ 30 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష జరగనుంది. కాగా జేఈఈ మెయిన్ సెషన్ 1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, జేఈఈ మెయిన్ సెషన్ 2కు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే..అటువంటి వారు లాగిన్ అయ్యేటప్పుడు గతంలో కేటాయించిన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయడం ద్వారా లాగిన్ అవ్వవచ్చు. అప్లికేషన్ ఫాంలో పేపర్ వివరాలు, పరీక్ష మీడియం, పరీక్ష కేంద్రం, ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపులు.. మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. కొత్తగా మళ్లి దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.