AP TET 2022: ఏపీ టెట్‌-2022 నోటిఫికేషన్‌ పూర్తిగా చదివారా? ఈ సారి పొరుగు రాష్ట్రాల్లోనూ టెట్‌ పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 (AP TET 2022) నోటిఫికేషన్‌ శుక్రవారం (జూన్‌ 10) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే పరీక్షకేంద్రాల (Examination Centre) సర్దుబాటు విషయమై విద్యాశాఖ నూతన నిర్ణయం తీసుకుంది. అందేంటంటే..

AP TET 2022: ఏపీ టెట్‌-2022 నోటిఫికేషన్‌ పూర్తిగా చదివారా? ఈ సారి పొరుగు రాష్ట్రాల్లోనూ టెట్‌ పరీక్ష కేంద్రాలు..
Ap Tet 2022
Follow us

|

Updated on: Jun 11, 2022 | 3:57 PM

AP TET 2022 Application Last Date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 (AP TET 2022) నోటిఫికేషన్‌ శుక్రవారం (జూన్‌ 10) విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో సాధించిన మార్కులకు, టెట్‌ నుంచి 20 శాతం వెయిటేజీ మార్కులు కలపడం జరుగుంది. అందుకుగానూ ఉపాధ్యాయనియామక ప్రక్రియ చేపట్టడానికి ముందు టెట్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ యేడాది టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 6 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఐతే పరీక్షకేంద్రాల (Examination Centre) సర్దుబాటు విషయమై విద్యాశాఖ నూతన నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంటే మొదట దరఖాస్తు చేసుకున్నవారికే రాష్ట్రంలో పరీక్ష కేంద్రాం కేటాయిస్తారన్నమాట.

చివరి తేదీ.. చివరి నిముషం.. వరకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధులు పరీక్ష రాయడానికి రాష్ట్ర సరిహద్దులు దాటవల్సిన సరిస్థితి నెలకొంది. స్థానికంగా కంప్యూటర్‌ కేంద్రాలు లేవనే సాకుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెల్పింది. దీంతో నిరుద్యోగుల్లో గుబులు నెలకొంది. ఇప్పటికే పరీక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.500 చెల్లించాలి. తప్పుడు వివరాలు నమోదు చేస్తే మరో రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్ధులు వేరువేరుగా రెండు పేపర్లకు ఫీజు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లడంతోపాటు వసతికి అయ్యే ఖర్చులతో కలుపుకుంటే తడిసిమోపెడయ్యే పరిస్థితి నొలకొంది.

నోటిఫికేషన్‌ వివరాలు క్లుప్తంగా మీకోసం..

ఇవి కూడా చదవండి

అర్హతలు: పేప‌ర్‌ 1, పేపర్‌ 2 పరీక్షలను బ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్‌/యూజీడీపీఈడీ/డీపీఈడీ/బీపీఈడీ లేదా త‌త్సమాన అర్హత ఉండాలి. 2020-22 విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చుసుకోవచ్చు.

కేటగిరీల వారీగా పాస్‌ మార్కులు ఇలా..

  • ఓసీ(జనరల్‌) అభ్యర్ధులకు: 60% మార్కులు ఆపైన‌
  • బీసీ అభ్యర్ధులకు: 50% మార్కులు ఆపైన‌
  • ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: 40% మార్కులు ఆపైన‌

ప‌రీక్ష కేంద్రాలు: ఏపీకి చెందిన అన్ని జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఒడిశా.

దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష (CBT) విధానంలో జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 16, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జులై 16, 2022.
  • హాల్‌టికెట్టు డౌన్‌లోడ్: జులై 25 నుంచి
  • పరీక్షల నిర్వహణ: ఆగస్టు 6 నుంచి 21 వరకు జరుగుతాయి.
  • ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల: ఆగస్టు 31, 2022.
  • అభ్యంతరాలు లేవనెత్తడానికి గడువు: సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు, 2022.
  • ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ విడుదల: సెప్టెంబర్‌ 12, 2022.
  • ఏపీ టెట్‌ 2022 ఫలితాల విడుతల తేదీ: సెప్టెంబర్‌ 14, 2022.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం