Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MJP APBCRJC CET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే..

మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJAPBCWREIS) 2022 - 23 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్రంలోని మొత్తం 14 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఏపీ ఆర్జేసీసెట్- 2022 ప్రవేశ పరీక్ష..

MJP APBCRJC CET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే..
Mjp Apbcrjc Cet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2022 | 8:04 PM

MJP APBCRJC CET 2022 Exam Date: మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJAPBCWREIS) 2022 – 23 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్రంలోని మొత్తం 14 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఏపీ ఆర్జేసీసెట్- 2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటర్‌ ఇంగ్లీష్‌ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతి (ఏప్రిల్‌ 2022) పరీక్షలకు హాజరయిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించరాదు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://apgpcet.apcfss.in/MJPAPBCWR/లో ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దరఖాస్తు రుసుము రూ. 250లు తప్పనిసరిగా చెల్లించాలి. ఏపీ ఆర్జేసీసెట్- 2022 పరీక్ష జూన్‌ 26న జరగనుంది. మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లీష్‌ మీడియంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • నోటిఫికేషన్‌ విడుదల తేదీ: జూన్‌ 2, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ముగింపు తేదీ: జూన్‌ 16, 2022.
  • పరీక్ష తేదీ: జూన్‌ 26, 2022 (ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట 30 నిముషాల వరకు).
  • ఫలితాల ప్రకటన తేదీ: జులై 3, 2022.
  • సీట్ల కేటాయింపు: జులై 4 నుంచి జులై 6 వరకు

MJP APBCRJC CET 2022 నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.