World’s Best School Prizes: భారత్‌కు అరుదైన ఘనత! ప్రపంచ అత్యుత్తమ స్కూళ్లలో మన దేశానికి చెందిన 5 పాఠశాలలకు స్థానం..

యూకేలో ప్రారంభమైన వారల్డ్‌ బెస్ట్‌ స్కూల్‌ ప్రైజ్‌ కాంపిటీషకు మన దేశానికి చెందిన 5 స్కూళ్లు టాప్‌ 10 టిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఇందుకు సంబంధించిన..

World’s Best School Prizes: భారత్‌కు అరుదైన ఘనత! ప్రపంచ అత్యుత్తమ స్కూళ్లలో మన దేశానికి చెందిన 5 పాఠశాలలకు స్థానం..
World's Best Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2022 | 6:01 PM

5 Indian schools on shortlist for first-ever World’s Best School Prizes: యూకేలో ప్రారంభమైన వారల్డ్‌ బెస్ట్‌ స్కూల్‌ ప్రైజ్‌ కాంపిటీషకు మన దేశానికి చెందిన 5 స్కూళ్లు టాప్‌ 10 టిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఇందుకు సంబంధించిన టాప్‌ 10 స్కూళ్ల జాబితాను గురువారం (జూన్‌ 9)న విడుదల చేయగా.. మన దేశానికి చెందిన 5 స్కూళ్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. బెస్ట్‌ స్కూల్‌కు ప్రైజ్‌ మనీగా మొత్తం రూ. 1,94,32,875 (USD 2,50,000)లు అందించనున్నట్లు యూకే ప్రకటించింది.

ఇన్నోవేషన్‌ విభాగంలో ముంబైలోని SVKMs CNM School, న్యూఢిల్లీలోని ఎస్‌డీఎమ్‌సీ ప్రైమరీ స్కూల్ టాప్‌ 10లో స్థానం దక్కించుకున్నాయి. కమ్యూనిటీ కోలాబరేషన్ విభాగంలో టాప్‌ 10లో ముంబైలోని ఖోజ్ స్కూల్, పూణేలోని పీసీఎమ్‌సీ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లకు చెందిన పేర్లు ఉన్నాయి. ఇక వరల్డ్ బెస్ట్‌ స్కూల్‌ ప్రైజ్‌ జాబితాలోనైతే హౌరాలోని సమారిటన్ మిషన్ స్కూల్ స్థానం దక్కించుకుంది.

కోవిడ్‌ కల్లోలకాలంలో స్కూళ్లు, యూనివర్సిటీల మూసివేత కారణంగా దాదాపు 1.5 బిలియన్లకు పైగా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యారు. మహమ్మారి ప్రపంచ విద్యా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. 2030 నాటికి యూనివర్సల్ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ సాధించాలని ఐక్యారాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ దిశగా అడుగువేస్తున్న తరుణంలో పురోగతి చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు’ టీ4 ఎడ్యుకేషన్‌, వరల్డ్‌ బెస్ట్‌ స్కూల్‌ ప్రైజెస్‌ ఫౌండర్‌ వికాస్‌ పోట పేర్కొన్నారు. విద్యార్ధుల జీవితాలలో మార్పును కలిగించేందుకు, స్ఫూర్తిదాయకమైన స్కూళ్ల కథనాలను పంచుకునేందుకు గానూ వరల్డ్‌ బెస్ట్‌ స్కూల్‌ ప్రైజెస్‌ను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యయాసన్ హసనా, టెంపుల్‌టన్ వరల్డ్ ఛారిటీ ఫౌండేషన్, లెమాన్ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో యూకే హెడ్‌ క్వార్టర్డ్‌ డిజిట్‌ మీడియా ప్లాట్‌ఫారమ్ T4 ఎడ్యుకేషన్ ద్వారా వరల్డ్స్ బెస్ట్ స్కూల్ ప్రైజ్‌లు ప్రకటించింది. కమ్యూనిటీ కొలాబరేషన్‌, ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్, ఇన్నోవేషన్, ఓవర్‌కమింగ్ అడ్వర్సిటీ, సపోర్టింగ్ హెల్తీ లైవ్స్ అనే ఐదు అంశాల్లో బహుమతులను ప్రధానం చేసేందుకు.. ఒక్కో విభాగం నుంచి మూడు స్కూళ్లను ఫైనలైజ్‌ చేసి ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.