AP Polycet 2022 Results: రేపే ఏపీ పాలీసెట్‌-2022 ఫలితాల ప్రకటన.. ఇలా చెక్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఫలితాలు రేపు (జూన్‌ 10) విదలవ్వనున్నాయి..

AP Polycet 2022 Results: రేపే ఏపీ పాలీసెట్‌-2022 ఫలితాల ప్రకటన.. ఇలా చెక్‌ చేసుకోండి..
Ap Polycet 2022
Follow us

|

Updated on: Jun 09, 2022 | 3:37 PM

AP Polycet 2022 Result date: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఫలితాలు రేపు (జూన్‌ 10) విదలవ్వనున్నాయి. ఇప్పటికే పాలీసెట్‌ ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసింది. పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ hptts://polycetap.nic.in లేదా www.sbtetap.gov.inలో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అదే రోజు ర్యాంక్‌ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అయ్యి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. కాగా పరీక్షకు హాజరయిన విద్యార్థులకు 120 మార్కులకుగాను కనీసం 25 శాతం మార్కులు అంటే 30 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించింది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు ప్రత్యేకంగా క్వాలిఫైయింగ్‌ మార్కులంటూ ఏమీ ఉండవని బోర్డు తెలియజేసింది. ఐతే అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన ర్యాంకుల ప్రకారం వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.

2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో ఏపీ పాలీసెట్‌-2022 ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు దాదాపు1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.